అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ఏజెన్సీ పరిధిలోని నీరుతోటపాలెం Pastor Abhinay వద్ద భరోసా పార్టీ అధ్యక్షుడు పాస్టర్ అభినయ్ దర్శన్‌పై బ్లేడుతో జరిగిన దాడి కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ దాడి అంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన డ్రామా అని పోలీసులు తేల్చారు.
సానుభూతి కోసం పక్కా స్క్రిప్ట్!
రాజకీయంగా, సామాజికంగా సానుభూతి సంపాదించడం కోసమే పాస్టర్ అభినయ్ స్వయంగా ఈ స్కెచ్ వేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
సినిమా ఫక్కీలో: తన అనుచరులతో కలిసి తానే స్వయంగా ఈ దాడి సీన్లను క్రియేట్ చేయించుకున్నారని, బ్లేడుతో గాయాలు చేయించుకుని కారు అద్దాలు పగలగొట్టించారని పోలీసులు గుర్తించారు.
అరెస్ట్: ప్రభుత్వంపై నిందలు వేయడానికి, సోషల్ మీడియాలో వైరల్ చేసి డబ్బులు వసూలు చేయడానికి ఈ డ్రామా ఆడినట్లు తేలడంతో పోలీసులు కేసు నమోదు చేసి పాస్టర్ అభినయ్‌ను, ఆయనకు సహకరించిన వారిని అరెస్ట్ చేశారు.

నన్ను చంపాలని చూస్తున్నారు: పాస్టర్
మరోవైపు ఈ ఆరోపణలను పాస్టర్ అభినయ్ తోసిపుచ్చారు. పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారని, ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకే గతంలో ప్రవీణ్ పగడాల అనే పాస్టర్‌ను Pastor Abhinay చంపాలని చూసినట్లే.. ఇప్పుడు తనను కూడా చంపేందుకు కుట్రలు పన్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ కేసు ఏజెన్సీ ప్రాంతంలో తీవ్ర సంచలనంగా మారింది.
ఇవి కూడా చదవండి
birdcare: మండుతున్న ఎండలు..
tour scam: ఊటీ, గోవా టూర్ ప్యాకేజీల పేరుతో నయా మోసం!
school news : స్కూల్స్ రీఓపెనింగ్ డేట్ మారింది! కీలక ప్రకటన
cockroach : ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలనం.. అసలేంటి ఈ ‘కాక్రోచ్’ పార్టీ?