ఆన్లైన్ ఫార్మసీల విధానాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న ఫార్మసీ యజమానులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్నెట్ ద్వారా మందుల అమ్మకాలను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ నేడు దేశవ్యాప్త నిరసనకు దిగారు. ఇందులో భాగంగా దేశంలో medical shops close (మెడికల్ షాపుల బంద్) కానున్నాయి.
12 లక్షలకు పైగా షాపులు మూత!
ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ కెమిస్ట్స్ & డ్రగ్గిస్ట్స్ (AIOCD) ఈ దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది.
- భారీ ప్రభావం: ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా దాదాపు 12.40 లక్షలకు పైగా మెడికల్ షాపులు నేడు మూతపడనున్నాయి.
- ముఖ్య కారణం: కార్పొరేట్ సంస్థలు ఆన్లైన్లో విచ్చలవిడిగా మందులను విక్రయించడం వల్ల స్థానికంగా ఉండే చిన్న, మధ్యతరహా మెడికల్ షాపుల వ్యాపారాలు దెబ్బతింటున్నాయని అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేస్తోంది.

రోగులకు తప్పని ఇబ్బందులు!
ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఇన్ని లక్షల మెడికల్ దుకాణాలు మూతపడనుండటంతో సాధారణ రోగులకు మందుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. అత్యవసర మందుల కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం medical shops close స్పందించి ఆన్లైన్ మందుల అమ్మకాలపై కఠిన నిబంధనలు తీసుకురావాలని కెమిస్ట్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది.
ఇవి కూడా చదవండి
birdcare: మండుతున్న ఎండలు..
tour scam: ఊటీ, గోవా టూర్ ప్యాకేజీల పేరుతో నయా మోసం!
school news : స్కూల్స్ రీఓపెనింగ్ డేట్ మారింది! కీలక ప్రకటన
cockroach : ఇన్స్టాగ్రామ్లో సంచలనం.. అసలేంటి ఈ ‘కాక్రోచ్’ పార్టీ?