మనకు ఆదివారం సెలవు ఎలా వచ్చింది? ఈ విషయం ఎప్పుడైనా ఆలోచించారా.. అయితే దీని వెనుక పెద్ద శ్రమే ఉంది.. అది ఏంటో మీరే చూసేయండి.
sunday holiday history india: నేడు ఆదివారం వచ్చిందంటే చాలు.. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ పండగే. వారం అంతా కష్టపడి పని చేసిన తర్వాత వచ్చే ఆ ఒక్క రోజు విశ్రాంతి మనకు ఎంతో హాయిగా ఉంటుంది. హమ్మయ్యా ఇంకా రెండు రోజులే ఉంది ఆదివారం. ఇంకా మూడు రోజులే ఉంది ఆదివారం అని మీలో ఎంత మంది అనుకుంటూ పని చేస్తున్నరో ఒక్కసారి గుర్తు చేసుకోండి… అవును మీలో చాలా మంది ఇలాగే ఆలోచిస్తూన్నారు కదా.. కానీ, ఒకప్పుడు భారతదేశంలో ఈ ఆదివారం సెలవు అనేది ఉండేది కాదు. బ్రిటిష్ పాలనలో కార్మికులు బానిసల్లా పని చేసేవారు. మరి అలాంటి రోజుల sunday holiday history india నుండి నేటి ఆదివారం సెలవు’ రోజు వరకు ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకోవాలంటే మనం 1880వ దశకంలోకి వెళ్లిపోదాం.
విశ్రాంతి లేని జీవితాలు.. మిల్లు కార్మికుల బాధలు
భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న రోజుల్లో మిల్లు కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేదని తెలుస్తుంది. తెల్లవారుజామునే పని మొదలైతే, చీకటి పడేవరకు పని చేస్తూనే ఉండేవారు. కనీసం భోజనం చేయడానికి కూడా సమయం ఉండేది కాదు. వారంలో ఏడు రోజులూ పని చేయాల్సిందే. శనివారం లేదు, ఆదివారం లేదు.. కేవలం యంత్రాల్లా శ్రమించడమే వారి జీవితంగా మారిపోయింది. కనీసం నెలలో ఒక్క రోజు కూడా తమ కుటుంబంతో గడపడానికి వారికి అవకాశం దొరకేది కాదు.

నారాయణ మేఘాజీ లోఖండే: ఎవరితను
కార్మికుల పడుతున్న ఈ కష్టాలను చూసి చలించిపోయిన ఒక వ్యక్తి నారాయణ మేఘాజీ లోఖండే. ఆయన్ను మనం ‘భారత కార్మిక ఉద్యమ పితామహుడు’ అని పిలుచుకుంటాం. లోఖండే బ్రిటిష్ అధికారులతో ఒక వినూత్నమైన sunday holiday history india వాదన మొదలుపెట్టారు. అదేంటంటే “మనం వారం రోజులు మన కుటుంబం కోసం సంపాదిస్తాం. కానీ మనం పుట్టిన సమాజానికి సేవ చేయడానికి మనల్ని కాపాడే దేవుడికి కృతజ్ఞత చెప్పుకోవడానికి ఒక రోజు సమయం ఉండాలి కదా?” అని ఆయన ప్రశ్నించారు. అప్పట్లో కార్మికులు ఆదివారం పూట తమ కుల దైవమైన ‘ఖండోబా’ను పూజించేవారు. ఆ కారణంతోనైనా ఆదివారం సెలవు ఇవ్వాలని ఆయన కోరారు.
ఏడేళ్ల సుదీర్ఘ పోరాటం.. తలవంచిన బ్రిటిష్ ప్రభుత్వం
లోఖండే వాదనలు విన్న బ్రిటిష్ పాలకులు మొదట హేళన చేశారు. “పని ఆపితే మాకు లాభాలు తగ్గిపోతాయి” అని తేల్చి చెప్పారు. కానీ లోఖండే గారు వెనకడుగు వేయలేదు. వేలాది మంది కార్మికులను ఏకం చేసి అనేక సభలు నిర్వహించారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వరుస విజ్ఞప్తులు పంపారు. ఈ పోరాటం ఏదో కొన్ని రోజులు సాగలేదు.. ఏకంగా ఏడు సంవత్సరాల పాటు నిరంతరాయంగా సాగింది. చివరకు కార్మికుల ఐక్యత ముందు లోఖండే పట్టుదల ముందు బ్రిటిష్ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.
1890 జూన్ 10.. ఒక చారిత్రాత్మక దినం
చివరికి 1890 జూన్ 10వ తేదీన బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా ఒక ప్రకటన చేసింది. భారతదేశంలోని మిల్లు కార్మికులందరికీ ప్రతి ఆదివారం వేతనంతో కూడిన సెలవు (Paid Holiday) ఇస్తున్నట్లు ప్రకటించింది. ఆ రోజు నుండి భారతదేశంలో ఆదివారం అనేది విశ్రాంతికి, ఆధ్యాత్మిక చింతనకు, కుటుంబానికి కేటాయించే రోజుగా స్థిరపడిపోయింది. లోఖండే చేసిన ఆ మహత్తర పోరాటం వల్లే నేడు మనం ఆదివారాన్ని హాయిగా ఎంజాయ్ చేయగలుగుతున్నాం. మనం sunday holiday history india అనుభవిస్తున్న ప్రతి చిన్న సౌకర్యం వెనుక ఒక పెద్ద చరిత్ర, ఎందరో మహానుభావుల త్యాగం దాగి ఉంటుంది అనడానికి ఆదివారం సెలవే ఒక పెద్ద ఉదాహరణ. విన్నారు కదా ఆదివారం సెలవు వెనక వున్న చరిత్ర. ఇకనైనా ఆదివారం కుటుంబంతో హాయిగా గడపండి.
ఇవి కూడా చదవండి
birdcare: మండుతున్న ఎండలు..
tour scam: ఊటీ, గోవా టూర్ ప్యాకేజీల పేరుతో నయా మోసం!
school news : స్కూల్స్ రీఓపెనింగ్ డేట్ మారింది! కీలక ప్రకటన
cockroach : ఇన్స్టాగ్రామ్లో సంచలనం.. అసలేంటి ఈ ‘కాక్రోచ్’ పార్టీ?