Unknown facts about Dr BR Ambedkar Jayanti 2026

Ambedkar Jayanti | అంబేద్కర్ గురించి ఈ నిజాలు తెలుసా?

Ambedkar Jayanti: ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న మనం భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని ఎంతో ఘనంగా వేడుక‌గా జరుపుకుంటాం. ఆయనను కేవలం రాజ్యాంగ నిర్మాతగానే చాలామందికి తెలుసు. కానీ ఆయన జీవితంలో ప్రపంచానికే తెలియని ఎన్నో అరుదైన విజయాలు ఆశ్చర్యకరమైన నిజాలు దాగి ఉన్నాయి. ఈ Ambedkar Jayanti సందర్భంగా ఆయన గురించిన ఆ 5 షాకింగ్ విషయాలు మీ కోసం అందిస్తున్నాం.

1. విదేశాల్లో ఎకనామిక్స్‌లో డాక్టరేట్ పొందిన మొదటి భారతీయుడు

అంబేద్కర్ కేవలం న్యాయవాది మాత్రమే కాదు ఆయన ఒక గొప్ప ఆర్థికవేత్త. విదేశీ విశ్వవిద్యాలయం (లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్) నుండి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ (D.Sc) పొందిన మొట్టమొదటి భారతీయుడు ఈయనే. నేటికీ ప్రపంచంలోని టాప్ ఎకనామిస్టుల జాబితాలో ఆయన పేరు త‌ప్ప‌క ఉంటుంది.

2. మన జెండాపై ‘అశోక చక్రం’ తెచ్చింది ఎవ‌రు..

భారత జాతీయ జెండాపై అశోక చక్రం ఉండాలని ప్రతిపాదించింది అంబేద్కర్ గారే అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అంతకుముందు జెండా మధ్యలో చరఖా ఉండేది. కానీ అశోక చక్రం మన సంస్కృతికి మరియు ప్రగతికి చిహ్నమని ఆయన పట్టుబట్టి దానిని జాతీయ జెండాలో చేర్పించారు.

Unknown facts about Dr BR Ambedkar Jayanti 2026
Ambedkar Jayanti Special Article

3. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)

చాలామందికి తెలియని మరో అద్భుతమైన విషయం ఏంటంటే.. భారత రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటులో అంబేద్కర్ పాత్ర పోషించారు. ఆయన రాసిన “The Problem of the Rupee: Its Origin and Its Solution” అనే పుస్తకంలోని అంశాల ఆధారంగానే హిట్టన్ యంగ్ కమిషన్ RBIని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

4. పని గంటలను తగ్గించిన మహనీయుడు

ఒకప్పుడు భారతదేశంలో కార్మికులు రోజుకు 12 నుండి 14 గంటలు పనిచేయాల్సి వచ్చేది. కానీ, కార్మికుల కష్టాలను చూసి చలించిన అంబేద్కర్ గారు, వైస్రాయ్ కౌన్సిల్‌లో సభ్యుడిగా ఉన్నప్పుడు ఆ పని గంటలను 8 గంటలకు తగ్గిస్తూ చట్టం తెచ్చారు. నేడు మనం అనుభవిస్తున్న 8 గంటల పని విధానం ఆయన పెట్టిన భిక్షే అని ఎంత మందికి తెలుసు.

5. బాబా సాహెబ్ పేరు వెనుక ఉన్న కథ

అంబేద్కర్ అసలు ఇంటి పేరు ‘అంబావడేకర్’. కానీ ఆయనపై ఉన్న ప్రేమతో ఆయన పాఠశాల ఉపాధ్యాయుడు ‘కృష్ణ మహాదేవ్ అంబేద్కర్’ తన సొంత ఇంటి పేరును బాబా సాహెబ్‌కు ఇచ్చారు. అలా ఆయన పేరు అంబేద్కర్ గా నిలిచిపోయింది.

ఈ Ambedkar Jayanti సందర్భంగా ఆయన కేవలం ఒక వర్గానికి చెందిన నాయకుడు కాదని, ఆధునిక భారతదేశ నిర్మాత అని తెలుసుకోవడం మనందరి బాధ్యత.

మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా వెబ్‌సైట్‌ను ఫాలో చేయండి.

ఇవి కూడా చ‌ద‌వండి

birdcare: మండుతున్న ఎండలు..

tour scam: ఊటీ, గోవా టూర్ ప్యాకేజీల పేరుతో నయా మోసం!

school news : స్కూల్స్ రీఓపెనింగ్ డేట్ మారింది! కీలక ప్రకటన

cockroach : ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలనం.. అసలేంటి ఈ ‘కాక్రోచ్’ పార్టీ?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top