
వత్సవాయి / లింగాల: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం లింగాల గ్రామంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ శాసనమండలి సభ్యుడు (MLC) తొండపు దశరథ జనార్ధన్ (టీడీ జనార్ధన్) ఆదివారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక పోలింగ్ కేంద్రానికి విచ్చేసి సాధారణ ఓటరులా క్యూ లైన్లో నిలబడి ఓటు వేశారు.
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలి: టీడీ జనార్ధన్
ఓటు వేసిన అనంతరం ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్, జయప్రద ఫౌండేషన్ చైర్మన్ టీడీ జనార్ధన్ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైన ఆయుధమని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సరైన నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.


