NDG News
అల్లూరుపాడు రైతుల సక్సెస్ ఫార్ములా:
వత్సవాయి మండలం అల్లూరుపాడు గ్రామ రైతులు ఈ ప్రాంతానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. సంప్రదాయ పంటలైన పత్తి, మిర్చి సాగులో వరుస నష్టాలు రావడంతో, వారు ప్రత్యామ్నాయంగా ఆకుకూరల సాగును ఎంచుకుని లాభాల బాట పట్టారు. గత 15-20 ఏళ్లుగా సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఆకుకూరలు పండిస్తూ, రెండు నియోజకవర్గాల మార్కెట్లకు ప్రతిరోజూ సరఫరా చేస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయాన్ని ఇస్తున్న ఈ ఆకుకూరల సాగు విధానం ఇతర రైతులకు కూడా స్ఫూర్తిదాయకంగా మారుతోంది.