NDG News
తపోవన్ విద్యాలయం నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)
జగ్గయ్యపేట: జగ్గయ్యపేట పట్టణంలోని కోదాడ రోడ్డులో ఉన్న తపోవన్ విద్యాలయం నూతన భవన ప్రారంభోత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, అనంతరం నూతన భవనాన్ని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య గారు మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును అత్యుత్తమంగా తీర్చిదిద్దడంలో విద్యాసంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. తపోవన్ విద్యాలయం యాజమాన్యం ఆధునిక సౌకర్యాలతో కూడిన విద్యా వాతావరణాన్ని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. నేటి డిజిటల్ యుగంలో విద్యార్థులు సెల్ఫోన్లకు బానిసలుగా మారకుండా చదువుపై పూర్తి శ్రద్ధ, ఏకాగ్రత కలిగి ఉండాలని ఆయన హితవు పలికారు. చుట్టుపక్కల నియోజకవర్గాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి క్లిక్ చేయండి: NDG News.
అనంతరం పాఠశాల నూతన భవనంలోని క్లాస్ రూములు, ల్యాబ్స్ మరియు ఇతర వసతులను పరిశీలించిన ఎమ్మెల్యే గారు, విద్యార్థులతో కాసేపు ముచ్చటించి వారి విద్యాభ్యాసం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మందడపు సుధీర్, ఫస్ట్ వార్డు కౌన్సిలర్ సామినేని మనోహర్, జిల్లా వాణిజ్య విభాగం కార్యదర్శి గుత్తా సురేష్, రాటకొండ విజేశ్వరరావు, రాటకొండ శేషగిరి, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల NDG News తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.