NDG News
జగ్గయ్యపేటలో వేడెక్కిన రాజకీయం.. YCP V/S జనసేన:
రెండు సంవత్సరాల కూటమి పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమం జగ్గయ్యపేటలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వైసిపి నేత, మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్ ఇంటూరి చిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ విషయమై నియోజకవర్గ పరిధిలోని మూడు పోలీస్ స్టేషన్లలో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. సదరు వైసిపి నేతపై పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని జనసేన హెచ్చరించింది. ఆంధ్రా రాజకీయాల లేటెస్ట్ వార్తల కోసం లైక్ చేయండి: NDG News.