NDG News
హోం మంత్రిపై వ్యాఖ్యలకు నిరసనగా తంగిరాల సౌమ్య ధర్నా & జగ్గయ్యపేటలో YCP V/S జనసేన వివాదం
నందిగామ: హోం మంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నందిగామ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు తీవ్రంగా ఖండించారు. నందిగామలో కూటమి నాయకులు, మహిళా నేతలతో కలిసి ఆమె భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నిరసనలో భాగంగా గుడివాడ అమర్ నాథ్ ఫొటోపై కోడిగుడ్లు కొట్టి, ‘సే సారీ గుడివాడ’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అమర్నాథ్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే సౌమ్య డిమాండ్ చేశారు.