తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్య ప్రజల కోసం మరో సరికొత్త సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కొండంత అండగా నిలిచేలా indiramma jeevitha bheema scheme (ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం) అమలుకు అడుగులు వేగంగా పడుతున్నాయి. దీనిపై విధివిధానాలు ఖరారు చేసేందుకు మంగళవారం మంత్రివర్గ ఉపసంఘం అత్యవసరంగా భేటీ కానుంది.
నేడే కేబినెట్ సబ్ కమిటీ కీలక భేటీ
బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించిన ఈ indiramma jeevitha bheema scheme రూపురేఖలను ఖరారు చేసేందుకు ఈ సమావేశం జరగనుంది.
- అధ్యక్షత: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- పాల్గొనే మంత్రులు: ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
- ముఖ్య అజెండా: లబ్ధిదారుల అర్హతలు, నిబంధనలు మరియు దరఖాస్తు ప్రక్రియపై ఈ సబ్ కమిటీ చర్చించి విధివిధానాలు ఖరారు చేయనుంది.

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల భరోసా
ఏదైనా అనుకోని ప్రమాదం లేదా విపత్తు జరిగి ఇల్లు నడిపించే యజమాని చనిపోతే.. ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని డిజైన్ చేసింది.
- బీమా మొత్తం: అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా లభిస్తుంది.
- ఎంతమందికి లాభం?: ధనిక, పేద అనే తేడా లేకుండా రాష్ట్రంలోని సుమారు 1.15 కోట్ల కుటుంబాలకు ఈ బీమా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జూన్ 2 నుంచే ప్రారంభం?
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కానుకగా జూన్ 2వ తేదీ నుంచే ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. గడువు దగ్గర పడుతుండటంతో నేడు జరగబోయే కేబినెట్ సబ్ కమిటీ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి
birdcare: మండుతున్న ఎండలు..
tour scam: ఊటీ, గోవా టూర్ ప్యాకేజీల పేరుతో నయా మోసం!
school news : స్కూల్స్ రీఓపెనింగ్ డేట్ మారింది! కీలక ప్రకటన
cockroach : ఇన్స్టాగ్రామ్లో సంచలనం.. అసలేంటి ఈ ‘కాక్రోచ్’ పార్టీ?