hindu-organizations-protest-at-vijayawada-collector-office-for-nandigama-temple-land

26 రోజుల పోరాటానికి ఫలితం.. Nandigama Ramalingeswara Swamy Temple కోనేరు ఆక్రమణలపై జెసి సంచలన నిర్ణయం!

26 రోజుల పోరాటానికి ఫలితం.. Nandigama Ramalingeswara Swamy Temple కోనేరు ఆక్రమణలపై జెసి సంచలన నిర్ణయం!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న శ్రీ సుఖశామలాంబ సమేత (శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం) కోనేరు ఆక్రమణల వివాదం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. హిందూ సంఘాల సుదీర్ఘ నిరసనల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కీలక ప్రకటన చేసింది.

హైకోర్టు ఆర్డర్ ఉన్నా కాలయాపన!

పాత బస్టాండ్ వద్ద ఉన్న దేవస్థానానికి చెందిన 518 సర్వే నెంబర్లలోని 125 సెంట్ల కోనేరు స్థలం కొంతభాగం ఆక్రమణకు గురైంది. దీనిపై గత ఐదేళ్లుగా కోర్టులో పోరాడగా.. ఈ ఏడాది మార్చి 13న సదరు భూమి దేవస్థానానిదేనని హైకోర్టు తీర్పునిచ్చింది. అయినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో, గత 26 రోజులుగా హిందూ సంఘాలు శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నాయి.

hindu-organizations-protest-at-vijayawada-collector-office-for-nandigama-temple-land
Nandigama Ramalingeswara Swamy Temple

రంగంలోకి దిగిన జెసి ఇలక్కియ.. వచ్చే నెల 27న గడువు!

ఆందోళనలో భాగంగా 26వ రోజు హిందూ సంఘాల నేతలు విజయవాడ కలెక్టరేట్‌కు వెళ్లి అధికారులను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ (JC) ఎస్. ఇలక్కియ, IAS  కీలక హామీ ఇచ్చారు:

  • నోటీసులు జారీ: ఆక్రమితదారులందరికీ వచ్చే నెల 27.06.2026న కలెక్టర్ ఆఫీసుకు రావాల్సిందిగా ఇప్పటికే నోటీసులు జారీ చేశామని తెలిపారు.
  • చర్చలు: ఈలోపు దేవస్థాన అధికారులు, హిందూ సంఘాల ప్రతినిధులను పిలిచి మాట్లాడతామని చెప్పారు.
  • ఖచ్చితంగా ఖాళీ: ఎట్టిల్లోనూ ఆక్రమణలను ఖాళీ చేయించి, ఆ స్థలాన్ని దేవస్థాన కోనేరుకు అప్పగిస్తామని జెసి గారు స్పష్టం చేశారు.

మాట తప్పితే మళ్లీ పోరాటం!

జిల్లా జెసి గారి స్పష్టమైన హామీ మేరకు ప్రస్తుతానికి నిరసన కార్యక్రమాలను తాత్కాలికంగా ఆపుతున్నట్లు హిందూ సంఘాల నాయకులు ప్రకటించారు. ఇచ్చిన గడువు లోగా సమస్య పరిష్కారం కాకపోతే, మరల nandigama ramalingeswara swamy temple ఉమ్మడిగా ముందుకు వచ్చి పోరాడుతామని హెచ్చరించారు. 26 రోజుల పాటు అలుపెరగకుండా నిరసనల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:

ఈ భారీ నిరసన పోరాటంలో ముఖపాటి నాగయ్య, ఎలమంచిలి సుధీర్ బాబు, కొండబోలు వినాయకరావు, మునగంటి కామేశ్వరరావు, puలిపాటి లక్ష్మణరావు, తొర్లికొండ సీతారామయ్య, చిరుమామిళ్ల శ్రీనివాసరావు, నామన శ్రీ బాబు, అడపా స్వామి, పల్లపాటి కొరవి స్వామి, కోమరగిరి వాచస్పతి, వేపూరి నాగేశ్వరరావు, ఏలూరి గోవిందు, కొట్టే వెంకటేశ్వరరావు, అన్నవరపు రమణ, నూతక్కి విజయ్, టీ స్టాల్ మురళి, గుంజి శ్రీను, వందేమాతరం అశోక్, చవట నాగేశ్వరరావు, కొప్పు సాయి, బాణాల నరసింహారావు, తుటారి కృష్ణ, ఎర్ర గొర్ల లక్ష్మణ్, నకరికంటి నరేష్, కొంచెం లక్ష్మీనారాయణ, పారేపల్లి సాయి, అనుములు సారధి, గింజుపల్లి అనిల్, కొప్పు నరేంద్ర, డాక్టర్ సత్యనారాయణ, మిలట్రీ వెంకటేశ్వరరావు, కొప్పు ప్రభాకర్, చిన్నారి, మిట్టపల్లి మురళి, మహంకాళి వెంకన్న, కొప్పు రమేష్, కొమ్మవరపు స్వామి, Nandigama Ramalingeswara Swamy Temple ఈ ఊరి సురేష్, ఆది భాను తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

birdcare: మండుతున్న ఎండలు..

tour scam: ఊటీ, గోవా టూర్ ప్యాకేజీల పేరుతో నయా మోసం!

school news : స్కూల్స్ రీఓపెనింగ్ డేట్ మారింది! కీలక ప్రకటన

cockroach : ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలనం.. అసలేంటి ఈ ‘కాక్రోచ్’ పార్టీ?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top