janasena telangana

janasena telangana : తెలంగాణలో జ‌న‌సేన పోటీ .. ప‌వ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

హైదరాబాద్ (ఎన్‌డీజీ న్యూస్ మీడియా): ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిద‌ల‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర‌ రాజకీయాలపై కీలక వ్యాఖ్య‌లు చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. 2029లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పొత్తులు janasena telangana మరియు పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు రెండు తెలుగు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు తెర‌తీశాయి.

పొత్తుపై ఎవ‌రు వ‌స్తారో తెలియ‌దు

రానున్న‌ సార్వత్రిక ఎన్నికల్లో పొత్తుల అంశంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేమని పొత్తుల‌పై వ్యాఖ్యానించారు. 2029 ఎన్నికల సమయానికి ఏ పార్టీలు కలిసి వస్తాయో రావో తెలియ‌ద‌ని అన్నారు. ఎవరితో పొత్తులు ఉంటాయో కూడా ఇప్పుడు తెలియదని కాలమే దానికి సమాధానం చెబుతుందని ఆయ‌న తెలిపారు. అయితే తాను వ్యక్తిగతంగా తెలంగాణలో ఎన్నికల బరిలో నిలబడబోనని మాత్రం janasena telangana ఆయన క్లారిటీ ఇచ్చారు. “తెలంగాణలో నేను పోటీ చేయను.. కాక‌పోతే మా పార్టీ వాళ్లు నిలబడి గెలిస్తే చాలు” అని పవన్ కళ్యాణ్ తన వ్య‌క్తిగ‌త అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. అక్కడ నాయకత్వాన్ని బలోపేతం చేయ‌డానికి ఏం చేయాలో అన్నీ చేస్తామని అదే త‌మ లక్ష్యమని ఆయ‌న తెలిపారు.

ఆ ఎన్నిక‌ల్లో మాత్రం సొంతంగా పోటీచేస్తాం..

అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే రానున్న‌ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికలపై జనసేన అధినేత‌ ప్రత్యేక శ్ర‌ద్ధ చూపిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో janasena telanganaలో ఒంటరిగానే బరిలోకి దిగి పోటీ చేస్తామ‌ని పవన్ కళ్యాణ్ స్ప‌ష్టం చేశారు. హైదరాబాద్ నగర పరిధిలో పార్టీకి ఉన్న ఆదరణ అంద‌రికీ తెలుస‌ని ఆయ‌న అన్నారు. అందుకే క్యాడర్ బలాన్ని అంచనా వేసుకుని మ‌రి సొంతంగానే పోటీ చేయాలని దృఢ సంక‌ల్పంతో నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపారు. అటు ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే ఇటు తెలంగాణలో janasena telangana క్యాడర్‌ను యాక్టివ్ చేసేందుకు పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం ప‌ట్ల తెలంగాణ నాయ‌కులు ఆనందోత్సాహాలు జ‌రుపుకుంటున్నారు. మ‌రో వైపు ఇప్పుడే కొత్త పార్టీలు పెట్టి జ‌నంలోకి వెళుతున్న పార్టీ అధ్య‌క్షుల‌కు ఇది మింగుడు ప‌డ‌ని అంశం అని చెప్ప‌వ‌చ్చు. రానున్న‌ రోజుల్లో ఎలాంటి రాజకీయ మార్పులు చోటు చేసుకుంటాయో మ‌రి వేచి చూడాలి.

ఇవి కూడా చ‌ద‌వండి:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top