ఎన్‌డిజి సినిమా : రామ్ చరణ్ పెద్ది సినిమా తెరకెక్కిస్తున్న సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబుకి మెగా అభిమానులు తమ అభిమానాన్ని తెలుపుతూ ఫస్ట్ టైం డైరెక్టర్‌కు తగిన గుర్తింపు ఇచ్చారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. విజయవాడలో జరిగిన ‘peddi movie’ వేడుకల్లో డైరెక్టర్ బుచ్చిబాబు కటౌట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్! చేస్తుంది.
మాములుగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు మాత్రమే పెద్ద పెద్ద కటౌట్లు, పాలాభిషేకాలు జరగడం మనం అనేక సందర్భాల్లో చూస్తుంటాం. కానీ టాలీవుడ్‌లో దర్శకుడి ప్రతిభకు ఆయనపై వారికి వున్న నమ్మకాన్ని గౌరవిస్తూ అభిమానులు కటౌట్లు పెట్టే ట్రెండ్ కూడా కొత్తగా కనిపిస్తోంది. అందుకు నిదర్శనమే జూన్ 1న విజయవాడలో జరిగిన peddi movie ప్రమోషనల్ ఈవెంట్‌లో జరిగింది. పెద్ది సినిమా దర్శకుడు బుచ్చిబాబు సానా కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విజయవాడ అభిమానులు ఏర్పాటు చేసిన ఒక కొత్త ట్రెండీ కటౌట్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న దృశ్యాలు చూస్తున్నాం.
ఇదే ఇప్పుడు వైరల్
మెగా ప్యామిలీ నుంచి వచ్చిన హీరోకి ‘ఉప్పెన’ వంటి సెన్సేషనల్ హిట్‌తో మెప్పించిన బుచ్చిబాబు సానా అందిరికీ తెలిసిందే.. ఇప్పుడు రామ్ చరణ్‌తో ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో జరిగిన peddi movie ప్రమోషన్ వేడుక ప్రాంగణంలో ‘టీమ్ ఆర్సీ విజయవాడ’ (Team RC Vijayawada) అభిమానులు ఈ కటౌట్‌ను పెట్టడం విశేషంగా మారింది. ఒక బాడీ బిల్డర్ గెటప్‌లో ఉన్న ఈ కటౌట్ వెనుక ‘పెద్ది’ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ బ్యానర్లు ఉండగా, పక్కనే పూజా కార్యక్రమాలు కలశం నమూనాను కూడా ఇక్కడ పెట్టడం విశేషం. తమ హీరోకు ఒక అద్భుతమైన సినిమాను అందించబోతున్న ఈ దర్శకుడికి అభిమానులు ఈ విధంగా ప్రత్యేకమైన స్టైల్‌లో ట్యాంక్స్ తెలుపుకోవడం విశేషం.
సోషల్ మీడియాలో వైరల్
ఈ ఆకట్టుకునే కటౌట్ ఫోటో కాస్తా ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమవ్వడంతో మెగా అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రియులు కూడా విపరీతంగా ఆకట్టుకుంది. పలువురు భిన్నంగా స్పందిస్తున్నారు. ప్రమోషన్లలో విజయవాడ ప్రమోషన్లు వేరయా అంటూ సినీ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. అభిమానుల ఉత్సాహాన్ని తెలిపే peddi movie ఈ ఫోటోను బేస్ చేసుకుని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో రకరకాల పోస్టులు పెట్టడంతో ఇది కాస్త వైరల్‌గా మారింది. ఏదేమైనా, విజయవాడలో జరిగిన ఈ ఈవెంట్ అక్కడ ఏర్పాటు చేసిన డైరెక్టర్ బుచ్చిబాబు కటౌట్ హల్‌చల్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. బుచ్చిబాబు కటౌట్ టాలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు ఒక హాట్ హాట్ టాపిక్‌గా మారింది. బుచ్చిబాబు కటౌట్‌పై అభిప్రాయం ఏంటి.. కామెంట్‌లో తెలపండి.
