ఎన్డిజి న్యూస్ (విశాఖపట్నం) : గుడి అంటే ఎంత పవిత్రమైన ప్రదేశమో మనకు తెలుసు. ఉత్తరాంధ్ర హిందూవుల ప్రధాన ఆరాధ్య దైవం విశాఖపట్నం శ్రీ kanaka mahalaxmi అమ్మవారి క్షేత్రం. ఇలాంటి గొప్ప ఆలయంలో తీవ్ర వివాదమైన అంశం వెలుగులోకి వచ్చింది. ఆలయ నియమ నిబంధనలను సాంప్రదాయాలను పర్యవేక్షించాల్సిన వంశపారంపర్య ధర్మకర్త చైర్మన్ కందుల నాగరాజు చేసిన పని ఇప్పుడు హిందువుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తోంది. అమ్మవారి ఆలయ మండపం లోపల చెప్పులు ధరించి తిరగడం భక్తుల ఆగ్రహానికి కారణమవుతుంది. దీనికి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతుండటంతో స్థానికంగా హిందూవులలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
అధికారే ఇలా ఆలయంలో..
సామాజిక మాద్యమంలో వైరల్ అవుతున్న ఫోటో ఆధారాల ప్రకారం.. ఆలయ చైర్మన్ కందుల నాగరాజు ఆలయ అధికారులతో కలిసి భక్తుల క్యూ లైనులను పరిశీలిస్తున్నారు. అయితే అమ్మవారి పెద్ద చిత్రపటం ఉన్న ప్రధాన అంతర్గత మండపంలో స్టీల్ క్యూ లైన్ల లోపల ఆయన పాదరక్షలు (చెప్పులు) ధరించే నిలబడి భక్తులకు సూచనలు kanaka mahalaxmi చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించే ముందే భక్తులు తమ పాదరక్షలను వెలుపల వదిలివేసి వెళుతుంటారు. మరి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మండపంలో చెప్పులతో తిరగడంపై భక్తులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
హిందువుల ఆగ్రహం
అమ్మవారి ఆలయ మర్యాదలను కాపాడాల్సిన అధికారులే ఇలా వ్యవహరిస్తే సామాన్య భక్తులకు ఏం చెబుతారు. ఇదే ప్రశ్నలు భక్తులు అడుగుతున్నారు. శ్రీ kanaka mahalaxmi అమ్మవారి భక్తుల సెంటిమెంట్లను, ఆలయ మర్యాదను దెబ్బతీసేలా వ్యవహరించిన వారిపై సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరకర పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఆలయ అంతర్గత ప్రాంగణంలోనే కనీస నిబంధనలు పాటించకపోవడంపై ఉన్నతాధికారులు స్పందించాలని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు మరియు భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలి భక్తులు కోరుతున్నారు. ఇలాంటి అధికారులను ఏం చేయాలో కామెంట్లో తెలపండి.
