wedding

wedding : గౌసియా వివాహానికి సహకారం… ముందుండి నడిపించిన షేక్ సైదా..

ఎన్‌డిజి నిఘా ప్రతినిధి : మానవత్వానికి మతం ఉండదని, సేవకు రాజకీయ రంగు ఉండదని మరోసారి wedding రుజువైంది. మధిర గ్రామానికి చెందిన షేక్ గౌసియాకు తల్లిదండ్రులు లేని పరిస్థితిలో వివాహం కుదరగా, ఆ ఆనంద వేళ ఆర్థిక ఇబ్బందులు అడ్డు తగిలాయి. పెళ్లి ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న విషయం స్థానికుల ద్వారా తెలిసిన వెంటనే, షేక్ సైదా స్పందించారు.

భాధ‌ను విని ఆగిపోలేదు..

బాధను విన్నంత మాత్రాన ఆగిపోకుండా, దానికి పరిష్కారం చూపాలన్న సంకల్పంతో ముందుకు వచ్చారు. గౌసియా వివాహ ఖర్చుల నిమిత్తం దాతల నుంచి విరాళాలు సేకరించేందుకు చొరవ చూపారు. ఫలితంగా కేవలం కొద్ది రోజుల్లోనే దాతల సహకారంతో రూ.10,000 నగదును సమీకరించి, గౌసియాకు అందజేశారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో షేక్ సైదా మాట్లాడుతూ “గౌసియాకు తల్లిదండ్రుల లేని లోటు ఉన్నా, సమాజం ఆమెకు అండగా నిలవాలి.

ఎవ‌రూ ఒంట‌రివారు కాదు

పెళ్లి వంటి ముఖ్యమైన సందర్భంలో ఎవరూ ఒంటరిగా ఉండకూడదు. అందుకే దాతల సహకారంతో ఈ చిన్న సహాయం అందించగలిగాం” అని చెప్పారు. సమాజసేవ తనకు కొత్త కాదని, గతంలోనూ ఎంతో మంది పేద విద్యార్థులకు, అవసరాల్లో ఉన్న కుటుంబాలకు సహాయం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఇప్పటివరకు దాతల నుంచి అనేక విరాళాలు సేకరించి, నిజమైన అవసరాల్లో ఉన్నవారికి చేరవేశానని తెలిపారు. ఈ ఘటన మరోసారి చెబుతోంది.

wedding
wedding

యాన‌వ‌త్వమే గొప్ప‌ది..

రాజకీయ హోదా కంటే మానవత్వమే గొప్పదని. ఒక యువతీ వివాహానికి అండగా నిలిచిన ఈ సేవా wedding ప్రయత్నం, సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది. గౌసియా ముఖంలో కనిపించిన చిరునవ్వే, షేక్ సైదా చేసిన సేవకు నిజమైన గుర్తింపు.

ఇవి కూడా చ‌ద‌వండి:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top