cooling

cooling : జీరో ఖ‌ర్చు.. మీ రూమ్‌ను ఏసీలా మార్చండి

పెరిగిన ఎండ‌ల‌తో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా.. అయితే ఇది మీ కోస‌మే… ఇక వేడితో క‌లిసి బత‌కాల్సిన cooling అవ‌స‌రం లేదు. భానుడి భగభగలకు ఇళ్లు నిప్పుల కొలిమిలా త‌యార‌తున్నాయి. గదిలోకి వచ్చే వేడి గాలితో జనాలు అల్లాడిపోతున్నారు. అయితే ఎలాంటి కరెంట్ బిల్లు పెరగకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా (0 Budget)లో మీ రూమ్‌ని చ‌ల్ల‌గా ఉంచుకోవ‌డానికి ఇక్కడ కొన్ని అద్భుతమైన cooling చిట్కాలు ఉన్నాయి. వీటిని ట్రై చేస్తే మీ గది చల్లగా ఉంటుంది.

1. కిటికీలు, తలుపుల టెక్నిక్‌

పగటిపూట (ఉదయం 8 నుండి సాయంత్రం 5): బయట నిప్పులు చెరిగే ఎండ ఆపై వేడి గాలి వ‌స్తోంది. కాబట్టి ఈ సమయంలో గ‌ది కిటికీలు, తలుపులు పూర్తిగా మూసేయండి. వాటికి మందపాటి తెరలు (Curtains) లేదా బెడ్‌షీట్స్ కట్టడం వల్ల వేడి గాలి లోపలికి రాకుండా ఇవి అడ్డుకుంటాయి.

రాత్రిపూట (సాయంత్రం 6 తర్వాత): బయట వాతావరణం కొద్దిగా చల్లబడుతుంది కాబట్టి కిటికీలు, తలుపులు పూర్తిగా తెరివాలి. ఎదురెదురు కిటికీలు తెరిస్తే ఇంకా మంచిది. (Cross Ventilation) లోపల ఉన్న వేడి గాలి బయటకు పోయి చల్లని గాలులు లోపలికి వస్తుంది.

2. తడి క‌ర్టెన్ల‌ మ్యాజిక్!

కిటికీలకు తడి క‌ర్టెన్లు: కిటికీలకు ఉన్న కాటన్ తెరలను లేదా పాత కాటన్ బెడ్‌షీట్లను నీళ్లలో తడిపి పిండి కిటికీలకు కట్టండి. బయటి నుండి వచ్చే వేడి గాలి ఈ తడి గుడ్డల గుండా ప్రయాణించి రూమ్‌లోకి చల్లని గాలులు అంటే ఏసీ లాంటి గాలిని అందిస్తుంది.

ఫ్లోర్ను తుడవడం: రోజుకు రెండు మూడు సార్లు (ముఖ్యంగా మధ్యాహ్నం, సాయంత్రం) స‌మ‌యాల్లో రూమ్ ఫ్లోర్‌ను చల్లని నీటితో మొప్పింగ్ చేయండి. నేల చల్లబడితే రూమ్ ఉష్ణోగ్రత కూడా త్వరగా తగ్గుతుంది.

cooling
cooling

3. ఫ్యాన్ గాలి చిట్కా..

సాధారణంగా ఫ్యాన్ చేసే ప‌ని రూమ్‌లో ఉన్న వేడి గాలినే అక్క‌డే తిప్పుతుంది. కాబట్టి ఫ్యాన్ కింద లేదా టేబుల్ ఫ్యాన్ ముందు ఒక వెడల్పాటి గిన్నెలో చల్లని నీళ్లు (వీలైతే ఐస్ ముక్కలు) పెట్టి చూడండి. ఆ నీటి పైనుంచి వచ్చే గాలి గదిని చక్కగా చ‌ల్ల‌గా cooling చేసేస్తుంది.

4. ఎలక్ట్రానిక్స్ వ‌స్తువుల వాడకం..

టీవీలు, లాప్‌టాప్‌లు లేదా ఎక్కువ వెలుతురు ఇచ్చే పాత ఫిలమెంట్ బల్బులు చాలా వేడిని విడుదల చేస్తాయి. అవసరం లేనప్పుడు వీటికి ఆపేయ‌డం చేయాలి. మొబైల్ ఛార్జర్‌లను కూడా ప్లగ్‌లోనే ఉంచ‌కుండా బ‌య‌ట‌కు తీయాలి. ఇలా చేయ‌డం ముఖ్యం

5.ఇంట్లో మొక్క‌లు

ఒకవేళ మీ ఇంట్లో కలబంద (Aloe Vera), స్నేక్ ప్లాంట్, లేదా మనీ ప్లాంట్ లాంటి కుండీలు cooling ఉంటే, వాటిని రూమ్ లోపల కిటికీ దగ్గర పెట్టండి. ఇవి గదిలోని వేడిని పీల్చుకుని నాచురల్ కూలింగ్ను అందిస్తాయి.

ఇవి కూడా చ‌ద‌వండి:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top