Nandigama Crime News

Nandigama Crime : వజ్రాల ఆశ చూపి వృద్ధురాలికి ₹5 లక్షల నామం!

Nandigama Crime : తక్కువ ధరకు వజ్రాలంటూ ఆశ.. చివరకు వృద్ధురాలికి రూ.5 లక్షల షాక్!
నందిగామ పట్టణంలో ఒక షాకింగ్ మోసం వెలుగులోకి వచ్చింది. అమాయక వృద్ధులను టార్గెట్ చేస్తూ, వారి ఆశను పెట్టుబడిగా మార్చుకుని లక్షల రూపాయలు కాజేస్తున్న ఒక కిలాడీ మోసగాడి ఉదంతం ఇప్పుడు స్థానికంగా సంచలనం రేపుతోంది. Nandigama Crime News లో భాగంగా ఈ వజ్రాల మోసం వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

అసలేం జరిగింది?

నందిగామ పట్టణంలోని మయూరి హాల్ వద్ద గల చెరువు బాజారు సెంటర్‌లో షేక్ నూర్జహాన్ అనే వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తున్నారు. ఆమె పక్క ఇంట్లోనే నివసించే జల్లాపురం కృష్ణవేణి తండ్రి, జల్లాపురం కన్నా అలియాస్ కరుణాకర్ రెడ్డి తనకు వజ్రాల వ్యాపారం ఉందని ఆమెను నమ్మబలికాడు. కేవలం రూ.5 ల‌క్ష‌ల‌కే మార్కెట్‌లో రూ.10 నుండి రూ.15 లక్షల విలువ చేసే వజ్రాలు వస్తాయని అందులో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని వృద్ధురాలికి ఆశ చూపించాడు.

బంగారం తాకట్టు పెట్టి మరీ..

వజ్రాలు కొనడానికి తన వద్ద నగదు లేదని వృద్ధురాలు చెప్పడంతో, కరుణాకర్ రెడ్డి మరో ప్లాన్ వేశాడు. “నీ దగ్గర బంగారం ఉంది కదా అది తాకట్టు పెట్టి డబ్బులు ఇవ్వు.. లాభాల్లో వాటా ఇస్తాం అని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన నూర్జహాన్ 19.04.2025న ఓ గోల్డ్ తాకట్టు కార్యాలయంలో తన నగలు పెట్టి రూ.5 లక్షలు తీసి అతనికి ఇచ్చింది.

పోలీసుల ముందు ఒప్పుకున్నా .. నేటికీ ఇవ్వ‌ని వైనం

సంవత్సరం గడిచినా డబ్బులు ఇవ్వకపోవడంతో వృద్ధురాలు నందిగామ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కరుణాకర్ రెడ్డిని పిలిపించి విచారించగా, తాను డబ్బులు తీసుకున్న మాట వాస్తవమేనని అంగీకరించాడు. పోలీసుల సమక్షంలో హామీ పత్రం రాసిచ్చినా, నేటికీ ఆ వృద్ధురాలికి ఒక్క రూపాయి కూడా దక్కలేదు.

Nandigama Crime News
Nandigama Crime News

కిలాడీ కేటుగాడి అసలు రంగు!

ఈ కేసు విచారణలో మరికొన్ని దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి:

  • నేర చరిత్ర: నిందితుడిపై గతంలో చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు ఉందని, బెయిల్ మీద వచ్చి నందిగామలో తలదాచుకుంటున్నాడని తెలిసింది.
    అబద్ధపు హోదా: తాను అపార్ట్‌మెంట్ ఓనర్‌ని అని చెప్పుకునే కరుణాకర్ రెడ్డి నిజానికి ఒక అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడని బాధితురాలు పేర్కొన్నారు.
    మరిన్ని మోసాలు: కేవలం నందిగామలోనే కాకుండా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వృద్ధులను టార్గెట్ చేసి ఇతను మోసాలకు పాల్పడినట్లు సమాచారం.

అత్యాసే కొంప‌ముంచిందా..!

అత్యాశే కొంపముంచుతుందన్న సామెత ఈ ఘటనతో మరోసారి రుజువైంది. తక్కువ ధరకు వజ్రాలు, తక్కువ ధరకు బంగారం అంటూ వచ్చే అపరిచితులను నమ్మవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తన గోడును వినేవారే లేక బాధితురాలు ఇప్పుడు విజయవాడలోని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

ఇలాంటి మరిన్ని Nandigama Crime అప్‌డేట్స్ కోసం మా NDG News Media వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి.

ఇవి కూడా చ‌ద‌వండి

birdcare: మండుతున్న ఎండలు..

tour scam: ఊటీ, గోవా టూర్ ప్యాకేజీల పేరుతో నయా మోసం!

school news : స్కూల్స్ రీఓపెనింగ్ డేట్ మారింది! కీలక ప్రకటన

cockroach : ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలనం.. అసలేంటి ఈ ‘కాక్రోచ్’ పార్టీ?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top