Hyderabad Crow News: గంటలు గడిచినా రాని కాకి.. చివరకు కొనుక్కొచ్చి మరీ పిండం తినిపించారు!
హిందూ సంప్రదాయంలో మనిషి మరణించిన తర్వాత పెట్టే ‘పిండం’ కాకి ముడితేనే పితృదేవతలు శాంతిస్తారని నమ్మకం. కానీ, నగరాల్లో కాకుల సంఖ్య తగ్గిపోవడం ఇప్పుడు కొత్త ఇబ్బందులకు దారితీస్తోంది. హైదరాబాద్‌లోని పురానాపూల్ శ్మశానవాటికలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
గంటల తరబడి వేచి చూసినా..
ఇటీవల ఒక కుటుంబం తమ పితృకార్యం నిమిత్తం పురానాపూల్ శ్మశానవాటికలో పిండం సమర్పించారు. గంటలు గడుస్తున్నా, తీవ్రమైన ఎండల వల్ల ఒక్క కాకి కూడా అటువైపు రాలేదు. సాయంత్రం అవుతున్నా ఆచారకాండ పూర్తికాకపోవడంతో ఆ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది.
ముర్గి చౌక్ నుండి కాకి కొనుగోలు!
దిక్కుతోచని స్థితిలో ఆ కుటుంబ సభ్యులు ముర్గి చౌక్ మార్కెట్‌కు వెళ్లి, అక్కడ ఒక కాకిని కొనుగోలు చేసి తెచ్చారు. ఆ కాకికి పిండం తినిపించి తమ ఆచారాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన వారంతా “దుర్గుణాల యుగం అంటే ఇదేనేమో.. నైవేద్యం పెట్టేందుకు కూడా Hyderabad Crow News: కాకిని కొనే పరిస్థితి వచ్చింది” అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
birdcare: మండుతున్న ఎండలు..
tour scam: ఊటీ, గోవా టూర్ ప్యాకేజీల పేరుతో నయా మోసం!
school news : స్కూల్స్ రీఓపెనింగ్ డేట్ మారింది! కీలక ప్రకటన
cockroach : ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలనం.. అసలేంటి ఈ ‘కాక్రోచ్’ పార్టీ?
