Keesara Toll Plaza Accident BMW Car Lawyer Death NTR District

Keesara Toll Plaza Accident : కీసర టోల్ ప్లాజా వద్ద బీభత్సం: కారు మీద ప‌డ్డ లారీ

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం Keesara Toll Plaza Accident కీసర టోల్ ప్లాజా వద్ద శనివారం ఘోర‌ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది డి. శ్రీనివాస్ దుర్మరణం పాలయ్యారు.

అసలేం జరిగిందంటే?

విజయవాడలో జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో పాల్గొని, తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీనివాస్ ప్రయాణిస్తున్న BMW కారు టోల్ ఫీజు కట్టేందుకు కీసర టోల్ ప్లాజా వద్ద వేచివున్న స‌మ‌యంలో వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన ఒక సిమెంట్ లారీ ట్యాంకర్ అదుపుతప్పి నేరుగా కారుపై ప‌డింది. లారీ బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారంగా తెలిసింది.

Keesara Toll Plaza Accident BMW Car Lawyer Death NTR District
Keesara Toll Plaza Accident BMW Car Lawyer Death NTR District

సహాయక చర్యలు

ప్రమాదం జరిగిన వెంటనే టోల్ ప్లాజా సిబ్బంది మరియు పోలీసులు అప్రమత్తమయ్యారు. లారీ కింద పూర్తిగా నలిగిపోయిన కారు నుంచి వ్యక్తిని బయటకు తీసేందుకు జేసీబీ మరియు భారీ క్రేన్లను రంగంలోకి దించారు. కారులో శ్రీనివాస్ ఒక్కరే ఉన్నట్లు గుర్తించారు. దాదాపు గంటల తరబడి శ్రమించి ఆయన్ని బయటకు తీసినప్పటికీ, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

పోలీసుల పర్యవేక్షణ

ఘటన జరిగిన వెంటనే సిపి రాజశేఖర్ బాబు నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదంతో Keesara Toll Plaza Accident కారు పూర్తిగా ధ్వంసమై ఇనుప ముక్కలా మారిపోయింది.

–  కొప్పుల వెంక‌ట్రావు

ఇవి కూడా చ‌ద‌వండి

birdcare: మండుతున్న ఎండలు..

tour scam: ఊటీ, గోవా టూర్ ప్యాకేజీల పేరుతో నయా మోసం!

school news : స్కూల్స్ రీఓపెనింగ్ డేట్ మారింది! కీలక ప్రకటన

cockroach : ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలనం.. అసలేంటి ఈ ‘కాక్రోచ్’ పార్టీ?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top