peddi review

peddi review : రామ్ చ‌ర‌ణ్ పెద్ది జెన్యూన్ రివ్యూ..

ఎన్‌డీజీ సినిమా రివ్యూ: రామ్‌చ‌ర‌ణ్ ‘పెద్ది’ (Peddi) మూవీ ఎలా ఉంది? మెగా పవర్ స్టార్ విశ్వరూపం చూపించాడా బాస్..! రాజమౌళి గ్లోబల్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా peddi review పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దానికి తోడు ‘ఉప్పెన’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్ అనగానే థియేటర్లలో ఏదో మ్యాజిక్ జరగబోతుందని ఫ్యాన్స్ గట్టిగా ఆశపడ్డారు. భారీ హైప్‌తో జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ నిజంగానే మెగా ఫ్యాన్స్ ఆకలి తీర్చిందా? అసలు ఈ ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ కథలో చరణ్ నటన ఎలా ఉందో ఏమాత్రం దాచకుండా ముక్కుసూటిగా ఈ peddi review లో చూసేద్దాం బాస్.

అసలు కథ ఏంటంటే..

ప్రభుత్వ రికార్డుల్లో గానీ, కనీసం దేశ పటంలో గానీ ఓ పిన్ కోడ్ peddi review  కూడా లేని ఒక అట్టడుగు గిరిజన గ్రామానికి చెందిన కుర్రాడే మన పెద్ది (రామ్ చరణ్). ఆ ఊరికి ఎలాగైనా ఒక అడ్రస్, అధికారిక గుర్తింపు తీసుకురావాలని ఊరి పెద్ద అప్పలసూరి (జగపతి బాబు) ముప్పై ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉంటాడు. కానీ వ్యవస్థ మాత్రం వారిని అస్సలు పట్టించుకోదు. అదే ఊరిలో ఉండే పెద్ది స్థానికంగా ఉండే బెల్లం మిల్లులో పనిచేస్తూ, టైమ్ దొరికినప్పుడల్లా బెట్టింగ్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడుతూ లోకల్‌గా ‘ఆట కూలీ’గా పేరు తెచ్చుకుంటాడు.

అయితే ఉన్నత వర్గాల నుంచి, చుట్టుపక్కల ఉండే లీడర్ల నుంచి ఎదురయ్యే అవమానాలు, దాడులను భరిస్తున్న క్రమంలో పెద్దికి ఒక విషయం అర్థమవుతుంది. తమ ఊరి తలరాత మారాలన్నా, ప్రపంచానికి తమ ఉనికి తెలియాలన్నా ఆటల ద్వారా జాతీయ స్థాయికి peddi review  ఎదగడమే ఏకైక మార్గమని డిసైడ్ అవుతాడు. ఆ ప్రయాణంలో అతనికి రెజ్లింగ్ కోచ్ గౌరి నాయుడు (శివరాజ్ కుమార్) ఎలా పరిచయమయ్యాడు? క్రికెట్ బ్యాట్ పట్టిన చేతులతో రెజ్లింగ్ రింగ్‌లోకి దూకి, ఆ తర్వాత అథ్లెటిక్స్ వైపు పెద్ది ఎలా అడుగులు వేశాడు? చివరికి తన ఊరికి రైల్వే స్టేషన్, సొంత ఐడెంటిటీని ఎలా సాధించి పెట్టాడు? అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ.

స్క్రీన్ మీద ఎలా ఉందంటే?

డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఎంచుకున్న పాయింట్ చాలా బలంగా ఉంది. ఒక మారుమూల తెగ సమస్యకు స్పోర్ట్స్ ఎలిమెంట్‌ను జోడించి కథను నడిపించిన విధానం peddi review బాగుంది. సినిమా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే.. హీరో ఇంట్రడక్షన్ సీన్లు, ఉత్తరాంధ్ర నేటివిటీ డైలాగులు, రెగ్యులర్ మాస్ ఎలిమెంట్స్ చూపిస్తూ కథను కొంచెం స్లోగా నడిపించారు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ కూడా అంతగా పండ‌లేదు. కానీ ఎప్పుడైతే ప్రీ ఇంటర్వెల్ సీన్ వస్తుందో అక్కడ నుంచి సినిమా ఒక్కసారిగా ట్రాక్ ఎక్కుతుంది. అప్పటివరకు సాదాసీదాగా సాగిన కథ కాస్తా ఇంటర్వెల్‌తో మంచి హై ఇస్తుంది.

ఇక సెకండాఫ్‌లో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమా రేంజ్ ఒక్క‌సారిగా మారిపోతుంది. హీరో, కోచ్ మధ్య వచ్చే బాండింగ్, రెజ్లింగ్ రింగ్‌లో జరిగే ఫైట్స్ చాలా ఎమోషనల్‌గా అనిపిస్తాయి. ముఖ్యంగా లాస్ట్ 30 నిమిషాల క్లైమాక్స్ రేస్ సమాజంలోని అసమానతలపై రామ్ చరణ్ ఇచ్చే స్పీచ్ థియేటర్లలో ఆడియన్స్‌తో చప్పట్లు కొట్టిస్తాయి.

కానీ ఇక్కడే ఒక చిన్న సమస్య వచ్చింది ఫ్యాన్స్‌. సినిమా రన్ టైమ్ దాదాపు 3 గంటల పాటు (189 నిమిషాలు) ఉండటం వల్ల కొన్ని సీన్లు సాగతీసినట్లు అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని అనవసరపు సీన్లు ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. అలాగే స్పోర్ట్స్ సన్నివేశాలలో అక్కడక్కడా కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి, కొన్ని చోట్ల మరీ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అయితే ఆ ఎమోషన్ ముందు ఇవి పెద్దగా ఇబ్బంది పెట్టవులేండి.

ఇక ఎవరెలా చేశారంటే..

ఈ సినిమాకు రామ్ చరణ్ వన్ మ్యాన్ షో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు గురు. మూడు వేర్వేరు స్పోర్ట్స్ కోసం ఆయన మారిన విధానం ఆ ఫిజికల్ బాడీ లాంగ్వేజ్ peddi review నిజంగా క్రేజీ అన్న‌మాట‌. ఎమోషనల్ సీన్స్‌లో చరణ్ యాక్టింగ్ చూస్తే మనకు మళ్లీ ‘రంగస్థలం’ నాటి చిట్టిబాబు గుర్తురావ‌డం మాత్రం ఖాయం. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ఒక హాస్పిటల్ సీన్లో అయితే చరణ్ కెరీర్‌లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి.

ఇక హీరోయిన్ జాన్వీ కపూర్ (అచ్చియమ్మ) స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా, గ్లామర్ పరంగా చాలా బాగుంది. కాకపోతే ఆమె పాత్రకు కథలో ఇంకొంచెం స్కోప్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేదనిపిస్తుంది. శివరాజ్ కుమార్ తన మార్క్ నటనతో సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లగా జగపతి బాబు ఎప్పటిలాగే తన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నారు. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు బాగానే న‌టించారు.

ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఇచ్చిన peddi review బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) కొన్ని సీన్లను పీక్స్‌కు తీసుకెళ్లింది. ‘మస్సా మస్సా’ పాట విజువల్‌గా చాలా రిచ్‌గా ఉంది. చరణ్ స్టెప్పులు కూడా అదిరిపోయాయి. రత్నవేలు కెమెరా వర్క్ సినిమాకు మెయిన్ పిల్లర్. విజువల్స్ చాలా గ్రాండ్‌గా చూపించారు.

చివ‌రిగా..

కొన్ని కమర్షియల్ సాగతీతలు, నిడివి ఎక్కువ అవ్వడం లాంటి మైనస్ peddi review పాయింట్లు ఉన్నప్పటికీ.. రామ్ చరణ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, సెకండాఫ్‌లో వచ్చే పతాక స్థాయి ఎమోషన్స్ కోసం ‘పెద్ది’ సినిమాను థియేటర్లలో హ్యాపీగా ఒకసారి చూసేయొచ్చు బాస్.

మా ఎన్‌డీజీ సినిమా రేటింగ్: 3 / 5.

సరే మ‌రి.. ‘పెద్ది’ సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్‌లో మాతో పంచుకోండి!

ఇవి కూడా చ‌ద‌వండి:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top