collector

పార ప‌ట్టి.. ప‌నిచేసిన‌ క‌లెక్ట‌ర్‌

ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్ జిల్లా): ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో collector ఒక అరుదైన సంఘ‌ట‌న‌ ఆదర్శవంతమైన దృశ్యం ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకుంది. మండల పరిధిలోని మూలపాడు గ్రామంలో శుక్రవారం పర్యటించిన ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్ లక్ష్మిశా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ క్రమంలో కేవలం తనిఖీలకే పరిమితం కాకుండా స్వయంగా ఒక సాధారణ కూలీలా మారి పారపట్టి మట్టి ఎత్తి అక్కడ ఉన్న కూలీల‌ను ఆశ్చర్యపరిచారు.

కూలీలతో ముచ్చటించి.. ఆరా తీసి..

ఉపాధి పనులు క్షేత్రస్థాయిలో జ‌రుగుతున్నాయా లేదా అని పరిశీలించిన‌ అనంతరం కలెక్టర్ లక్ష్మిశా ఉపాధి కూలీలతో కాసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. వేసవి ఎండల్లో వారు పడుతున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరును అడిగిమ‌రి తెలుసుకున్నారు.

ముఖ్యంగా కూలీలను ఉద్దేశించి ఆయ‌న మాట్లాడుతూ పనుల దగ్గర collector అధికారుల తీరు ఎలా ఉంది? మీ కష్టానికి తగ్గట్లుగా వేతనాల డ‌బ్బులు సకాలంలో మీ బ్యాంకు ఖాతాల్లో జమవుతున్నాయా లేదా?” అని ఆరా తీశారు. కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేసవి తాగునీటి సౌకర్యాలు పక్కాగా కల్పించాలని అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

కూలీలతో కలిసి భోజ‌నం

ఉన్నతాధికారి హోదాలో ఉండి కూడా ఎలాంటి గర్వం లేకుండా ఎండ తీవ్రతను సైతం లెక్కచేయకుండా కూలీల పక్కనే నేల‌పై కూర్చుని వారితో కలిసి కలెక్టర్ లక్ష్మిశా అల్పాహారం తీసుకున్నారు. తమతో కలిసి పని చేస్తూ తమ సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోవడమే కాకుండా తమతో పాటు కూర్చుని టిఫిన్ చేయడంతో మూలపాడు గ్రామ ఉపాధి కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. collector చూపిన చొర‌వ‌తో ఈ సంఘ‌ట‌న స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.

ఇవి కూడా చ‌ద‌వండి:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top