chandrababu vennupotu

chandrababu vennupotu : చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు: వైసీపీ నేత‌ల నిర‌స‌న‌

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలను chandrababu vennupotu తుంగలో తొక్కిందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రోడ్డెక్కాయి. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా.. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి. నందిగామ నియోజకవర్గంలోని కంచికచర్ల, చందర్లపాడు మండలాల్లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ మోసపూరిత మేనిఫెస్టో ప్రతులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నడిరోడ్డుపై దహనం చేసి తమ నిరసనను గట్టిగా వినిపించారు.

కంచికచర్లలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు భారీ ర్యాలీ

కంచికచర్ల మండల, పట్టణ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెహ్రూ chandrababu vennupotu సెంటర్ నుండి చెవిటికల్లు సెంటర్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నందిగామ మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు గారు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నడుస్తూ కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం సాక్షిగా కూటమి మేనిఫెస్టోను దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ జగన్మోహనరావు మాట్లాడుతూ.. “గత వైసిపి chandrababu vennupotu ప్రభుత్వంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి తమ మేనిఫెస్టోను ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్ లా పవిత్రంగా భావించి ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చి చూపించారు. రాష్ట్రంలో నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించిన ఘనత ఒక్క జగనన్న ప్రభుత్వానికే దక్కుతుంది. కానీ నేడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ అంటూ అబద్ధపు, మోసపూరిత హామీలతో ప్రజలను నిలువునా ముంచేసింది. బాబు స్యూరిటీగా చెప్పాడంటే గ్యారెంటీగా మోసం చేస్తాడని ఈ రెండేళ్ల కాలంలో మళ్లీ నిరూపితమైంది” అంటూ ఘాటుగా విమర్శించారు.

బాబు నోరు మెదపడం లేదు

ఆడబిడ్డ నిధి కింద ఇస్తామన్న నెలకు 1,500 రూపాయలు, నిరుద్యోగులకు chandrababu vennupotu ఇస్తామన్న 3,000 రూపాయల భృతి, అలాగే బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ వంటి కీలక పథకాలపై నేడు చంద్రబాబు నోరు మెదపడం లేదని మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఈ వెన్నుపోటు ప్రభుత్వానికి ఓటర్లు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బండి మల్లికార్జున రావు, పట్టణ అధ్యక్షుడు వేమా సురేష్ బాబు, ఎంపీపీ మలక్ బషీర్, మరియు సీనియర్ నాయకులు పాటిబండ్ల హరిజగన్నాధ రావు, మార్తా శ్రీను, అమర్లపూడి యోహాను, దేవిరెడ్డి శ్రీనివాసరావు, మాడుగుల మధు, మాడుగుల శంకర్  తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చందర్లపాడు కూడలిలో నిరసన సెగలు

మరోవైపు చందర్లపాడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ chandrababu vennupotu ఆధ్వర్యంలో కూడా నిరసన కార్యక్రమం హోరెత్తింది. మండల పార్టీ అధ్యక్షుడు కందులు నాగేశ్వరరావు గారి నేతృత్వంలో చందర్లపాడు గ్రామంలోని ముఖ్య కూడలిలో కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు.

chandrababu vennupotu
chandrababu vennupotu

ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలను సాధ్యం కాని అబద్ధపు హామీలతో మోసం చేసి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిందని, ప్రజలకు వెన్నుపోటు పొడిచి రెండేళ్లు పూర్తయినందుకే జగనన్న పిలుపుతో ఈ నిరసనలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా సూపర్ సిక్స్ హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈ నిరసనలో పార్టీ సీనియర్ నాయకులు, జడ్పీటీసీ ముక్కపాటి నరసింహారావు, ఏఎంసీ మాజీ చైర్మన్ వెలగపూడి వెంకటేశ్వరరావు, యార్లగడ్డ ప్రసాద్, చింతోటి ప్రసాద్, chandrababu vennupotu చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు: వైసీపీ నేత‌ల నిర‌స‌న‌గుడేటి శ్రీనివాసరావు, జిల్లా అంగన్‌వాడీ మహిళా విభాగం అధ్యక్షురాలు శాఖమూరి వెంకట కుమారి, కొండా కృష్ణారెడ్డి, పెర్మసాని నరసింహారావు, ములకలపల్లి కృష్ణమోహన్, షేక్ జానీ సహా పలువురు కార్యకర్తలు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top