మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా? అయితే ఈ 7 గుర్తులు ఉంటే వెంటనే జాగ్రత్త పడండి!
Negative Energy: కొన్ని ఇళ్లలోకి వెళ్లగానే మనసు ఎంతో ప్రశాంతంగా, హాయిగా అనిపిస్తుంది. కానీ మరికొన్ని ఇళ్లలోకి అడుగుపెట్టగానే తెలియని ఏదో బరువు, అసౌకర్యం, భయం వేస్తుంది. దీనికి కారణం ఆ ఇంట్లో పేరుకుపోయిన నెగటివ్ ఎనర్జీ లేదా దుష్టశక్తుల ప్రభావం అయి ఉండవచ్చు. అసలు మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందో లేదో మీరు స్వయంగా మీరే ఎలా తెలుసుకోవాలి? దానికి గల లక్షణాలు మరియు పరిష్కార మార్గాలేంటో ఈ చిన్న ఆర్టికల్ కథనంలో తెలుసుకుందాం.
నెగటివ్ ఎనర్జీని సూచించే 7 భయంకరమైన లక్షణాలు
మీ ఇంట్లో గాలిలో దోషం లేదా ప్రతికూల శక్తి ఉంటే కింద పేర్కొన్న మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి:
- అకారణ కలహాలు: చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల మధ్య పెద్ద గొడవలు జరగడం చూడవచ్చు.
ఆరోగ్య సమస్యలు: ఇంట్లో ఎవరో ఒకరు ఎప్పుడూ అనారోగ్యంతో ఉండటం, డాక్టర్లకు కూడా ఆ జబ్బు ఏమిటో దొరక్కపోవడం చూడవచ్చు. - డబ్బు నిలవకపోవడం: ఎంత సంపాదించినా చేతిలో రూపాయి నిలవకుండా అనవసర ఖర్చులు రావడం జరుగుతుంది.
- నిద్ర సమస్య: సరిగ్గా నిద్ర పట్టకపోవడం పీడకలలు రావడం ఎవరో ఛాతీపై నొక్కుతున్నట్టు అనిపించడం.
- వింత దుర్వాసన: ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నా.. అప్పుడప్పుడు వింతైన దుర్వాసన రావడం.
- మొక్కలు ఎండిపోవడం: ఇంట్లోని తులసి మొక్క మాటిమాటికీ ఎండిపోవడం నెగటివ్ ఎనర్జీకి ప్రధాన సంకేతం.
- బద్ధకం: ఇంట్లో ఉండగానే విపరీతమైన నీరసం, ఏ పని చేయాలన్నా ఉత్సాహం లేకపోవడం వంటివి ఉంటాయి. దీనిని బట్టి తర్వాతి మార్గాలు ఏమిటో చూడండి.

మీరే స్వయంగా పరీక్షించుకునే పద్ధతులు ఇవి..
మీ ఇంట్లో దోషం ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ చిన్నా పరీక్షలు చేసి చూడండి అప్పుడు మీకే అర్థం అవుతుంది. అసలు విషయం.
గ్లాస్ వాటర్ టెస్ట్: ఒక గాజు గ్లాసులో నీరు తీసుకుని అందులో రాళ్ల ఉప్పు, వెనిగర్ వేసి ఇంటి మూలలో ఉంచండి. 24 గంటల తర్వాత ఆ నీరు రంగు మారితే అక్కడ నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టే.
నిమ్మకాయ పరీక్ష: ఒక నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కోసి, అందులో కుంకుమ వేసి ఇంటి నాలుగు మూలల్లో పెట్టండి. అవి త్వరగా నల్లగా మారితే గాలిలో దోషం ఉన్నట్లు అర్థం చేసుకోవాలి.
శక్తివంతమైన పరిష్కార మార్గాలు
నెగటివ్ ఎనర్జీని పారద్రోలి ఇంటిని సుఖసంతోషాలతో నింపుకోవడానికి ఈ చిన్న చిట్కాలు పాటించండి.
కల్లు ఉప్పు : ప్రతి మంగళవారం, శుక్రవారం ఇల్లు తుడిచే నీటిలో కొంచెం కల్లుప్పు (Sea Salt) వేసి తుడవండి.
ధూపం: రోజూ సాయంత్రం సాంబ్రాణి ధూపం వేయడం వల్ల దుష్టశక్తులు పారిపోతాయి.
మంత్ర పఠనం: ఇంట్లో ‘వెంకటేశ్వర సుప్రభాతం’ లేదా ‘హనుమాన్ చాలీసా’ ప్లే చేయడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి.
సూర్యరశ్మి: ఉదయాన్నే కిటికీలు తెరిచి ఉంచండి. సూర్యరశ్మి Negative Energy సోకే ఇళ్లలో నెగటివ్ ఎనర్జీ ఉండదు.
మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాల కోసం మా వెబ్‌సైట్‌ను డైలీ ఫాలో అవుతూ ఉండండి.
ఇవి కూడా చదవండి
birdcare: మండుతున్న ఎండలు..
tour scam: ఊటీ, గోవా టూర్ ప్యాకేజీల పేరుతో నయా మోసం!
school news : స్కూల్స్ రీఓపెనింగ్ డేట్ మారింది! కీలక ప్రకటన
cockroach : ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలనం.. అసలేంటి ఈ ‘కాక్రోచ్’ పార్టీ?
