today-nandigama-news
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు & వీరులపాడు పైపులైన్ వివాదం
విజయవాడ/నందిగామ: మ్మెల్యే తంగిరాల సౌమ్య గారి పత్రికా ప్రకటనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు, పట్టణ అధ్యక్షులు మహమ్మద్ మస్తాన్, కౌన్సిలర్లు పత్రికా ప్రకటన విడుదల చేస్తూ.. నందిగామకు 100 పడకల ఆసుపత్రి, కేంద్రీయ విద్యాలయం, శివాలయాభివృద్ధి నిధులు గత జగనన్న ప్రభుత్వంలోనే మంజూరయ్యాయని స్పష్టం చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే డమ్మీగా మిగిలిపోయారని, ఇసుక, గ్రావెల్ కమిషన్లపైనే శ్రద్ధ పెడుతున్నారని ఆరోపించారు.

పైపులైన్ ధ్వంసం ఘటనపై కలెక్టర్కు ఫిర్యాదు:
వీరులపాడు మండలంలోని 12 గ్రామాల ప్రజలకు తాగునీరు సరఫరా చేసే పైపులైనును రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసం, ₹50 లక్షల డీల్లో భాగంగా ధ్వంసం చేశారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ఆరోపించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఐఏఎస్ గారిని కలిసి ఆయన ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరియు స్థానిక వార్తల కోసం ఎప్పటికప్పుడు Nandigama News ఫాలో అవ్వండి.