Gas Booking Issues in telugu

gas booking issues : గ్యాస్ క‌ష్టాలు 5 కార‌ణాల వ‌ల్ల బుకింగ్ అవ‌డం లేదు

ఎన్టీఆర్ జిల్లా నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో గ్యాస్ వినియోగదారులకు ఇక్కట్లు త‌ప్ప‌డం లేదు. ఆన్‌లైన్ బుకింగ్ అవ్వ‌కా నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. అధికారులు gas booking issues వ‌స్తే ఫోన్ ఎత్తట్లేదని వినియోగ‌దారులు వాపోతున్నారు. అసలు గ్యాస్ కొరత ఉందా? లేక బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నాయా? పూర్తి వివరాలు మీ కోసం

Gas Crisis
Gas Booking Issues

గ్యాస్ కష్టాలు (Gas Crisis): బుకింగ్ కాక జనం విలవిల.. అధికారుల నిర్లక్ష్యంపై నిప్పులు!

ఒకవైపు గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే గ్యాస్ బుకింగ్ ప్రక్రియ గందరగోళంగా మారడంతో సామాన్య గృహ వినియోగదారులు నానా అవస్థలు పడుతున్నారు. గతంలో ఫోన్ కాల్ ద్వారా సులభంగా అయ్యే బుకింగ్ విధానం మారి, ఇప్పుడు వాట్సాప్‌ మరియు ఆన్‌లైన్ యాప్స్ రావడంతో నిరక్షరాస్యులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గ్యాస్‌ బుకింగ్ అవ్వదు.. ఏజెన్సీలు కదలవు!

నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లోని పలు గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారుల పట్ల అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. సిలిండర్ అయిపోయి ఏజెన్సీల వద్దకు వెళ్తే, “బుకింగ్ ఉంటేనే ఇస్తాం” అని సిబ్బంది తెగేసి చెబుతున్నారు. తీరా ఇంటికి వచ్చి ఆన్‌లైన్‌లో బుక్ చేద్దామంటే సర్వర్ సమస్యలతో బుకింగ్ కావడం లేదు. దీంతో గ్యాస్ అయిపోయిన ఇళ్లలో వంటలు మానేసి పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంద‌ని వినియోగ‌దారులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

బ్లాక్ మార్కెట్ అనుమానాలు!

అధికారులు గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నా, వినియోగదారులకు మాత్రం సకాలంలో సిలిండర్లు అందడం లేదు. దీంతో అసలు సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏజెన్సీలకు ఫోన్ చేసినా ఎవరూ స్పందించడం లేదని, కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్పందించని అధికారులు.. ఫోన్ ఎత్తని వైనం!

ఈ తీవ్రమైన సమస్యపై ‘NDG న్యూస్’ ప్రతినిధిగా అధికారులకు ఫోన్ చేసినా, వారు స్పందించకపోవడం గమనార్హం. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు ఫోన్ లిఫ్ట్ చేయని పరిస్థితి ఉందంటే, వ్యవస్థ ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

తక్షణమే తనిఖీలు చేపట్టాలి

ప్రజల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలి. గ్యాస్ గోడౌన్లలో నిల్వలను తనిఖీ చేయడంతో పాటు, బుకింగ్ ప్రక్రియను సరళతరం చేయాలి. వినియోగదారులను ఇబ్బంది పెడుతున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని  gas booking issues నందిగామ, జగ్గయ్యపేట ప్రజలు వేడుకుంటున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

birdcare: మండుతున్న ఎండలు..

tour scam: ఊటీ, గోవా టూర్ ప్యాకేజీల పేరుతో నయా మోసం!

school news : స్కూల్స్ రీఓపెనింగ్ డేట్ మారింది! కీలక ప్రకటన

cockroach : ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలనం.. అసలేంటి ఈ ‘కాక్రోచ్’ పార్టీ?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top