Naga Chaitanya

Naga Chaitanya : ఢిల్లీ హైకోర్టుకు హీరో నాగ‌చైత‌న్య‌.. కార‌ణం ఇదే..

ఎన్‌డిజి న్యూస్ మీడియా : తెలుగు ప్రముఖ నటుడు, హీరో నాగార్జున త‌న‌యుడు Naga Chaitanya ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. గ‌డిచిన‌ కొంతకాలంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, పలు సామాజిక‌ మాద్యమాలు, ఛానళ్లు మరియు కొన్ని వెబ్‌సైట్లలో తనపై వస్తున్న అసత్య ప్రచారాలు, డీప్‌ఫేక్ (AI) వీడియోలు, మరియు వ్యక్తిగత దూషణలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా న్యాయపోరాటానికి దిగారు. ముఖ్యంగా తన మాజీ భార్య సమంతను మోసం చేశానంటూ వస్తున్న ట్రోలింగ్, తన ప్రతిష్టను దెబ్బ‌తీసే విధంగా ఉంద‌ని, ప‌రువును నష్టం క‌లిగించే విధంగా ఉంద‌ని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివ‌ర‌ణ ఇచ్చారు. కేవలం వ్యూస్ కోసమే కొందరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయ‌న కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఢిల్లీ హైకోర్టు.. కీల‌క వ్యాఖ్య‌లు

ఈ పిటిషన్‌పై విచార‌ణ చేప‌ట్టిన‌ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతి సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా జీవితంలో ఉన్న సెలబ్రిటీలు సాధారణ ప్రజల కంటే ఎక్కువ నిఘాలో ఉండటం సహజమే అని ఉన్నారు.. దానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయ‌ని ఆయన తెలిపారు. ఒకరి వ్యక్తిగత జీవితాన్ని అడ్డుపెట్టుకుని వ్యాపార లబ్ధి పొందడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. నటుడి Naga Chaitanya అనుమతి లేకుండా ఆయన పేరు, వాయిస్, లేదా ఫొటోలను తప్పుగా వాడుతూ అశ్లీల కంటెంట్ క్రియేట్ చేయడం మరియు ఫేక్ సెర్చ్ ట్యాగ్స్‌తో ట్రాఫిక్ పెంచుకోవడాన్ని, త‌ప్పు దారులు అవ‌లంభిస్తున్న వారిని న్యాయస్థానం తీవ్రంగా త‌ప్పుబ‌ట్టింది

కోర్టు ఏం చెప్పింది..

నటుడి వ్యక్తిగత హక్కులను (Personality Rights) కాపాడుతూ ఢిల్లీ హైకోర్టు కీలకమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. Naga Chaitanya కు సంబంధించిన వివాదాస్పద లింకులను, డీప్‌ఫేక్ వీడియోలను వెంటనే ఇంటర్నెట్ నుంచి తొలగించాల్సిందిగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు మరియు గూగుల్, యూట్యూబ్ సంస్థలకు ఆదేశాలను ఇచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి కంటెంట్ కొత్త లింకుల రూపంలో వచ్చినా వాటిని అడ్డుకునేలా ఆదేశాలు ఇస్తూ.. తదుపరి పూర్తి స్థాయి విచారణను సెప్టెంబర్ 30కి వాయిదా వేస్తూ సమన్లు జారీ చేయ‌డం జ‌రిగింది.

గతంలో ఆయన తండ్రి, టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కూడా ఇదే విధంగా కోర్టును ఆశ్రయించిన సంగ‌తి తెలిసిందే. తన పర్సనాలిటీ రైట్స్ రక్షణ పొందడం గమనార్హం. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ లీగల్ నోటీసుల వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. చూడాలి మ‌రి ఇక నైనా ఇలాంటివి ఆగుతాయా… లేక మ‌రింత రెచ్చిపోతారా.. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియ‌జేయండి.

ఇవి కూడా చదవండి:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top