సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ కావడంతో చాలా మంది ఫ్యామిలీతో కలిసి ఊటీ, గోవా, కొడైకెనాల్ వంటి హిల్ స్టేషన్లకు వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నారు కదా. సరిగ్గా ఇదే సమయాన్ని సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఎలా అంటే నమ్మలేనంత తక్కువ ధరలకే విమాన టిక్కెట్లు, హోటల్ రూమ్స్ బుక్ చేస్తామంటూ సరికొత్త tour scam తెరపైకి తెచ్చారు. సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉంటుందో మీ అందరీకి చాలా బాగా తెలుసు కాబట్టి వాట్సాప్, టెలిగ్రామ్ లలో వస్తున్న లింక్స్ క్లిక్ చేస్తే అకౌంట్లు ఖాళీ అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి తక్కువ ధరకు ఆశపడి మీ జేబుకు చిల్లు పెట్టుకోకండి. మీకు తెలిసిన వారికి వెంటనే షేర్ చేయండి. ఒక్కరినైనా సేవ్ చేసినవారు అవుతారు. ఏమో టైం ఎలా మారుస్తుందో ఎవరికి తెలుసు.

ఆఫర్ల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు.. జాగ్రత్త!
ఈ తరహా tour scam లో కేటుగాళ్లు పక్కా ప్రణాళికను అమలు చేస్తారు. ఏమాత్రం అనుమానం రాకుండా ప్రముఖ ట్రావెల్ కంపెనీల పేర్లతో నేగోలతో అచ్చం అలాగే ఉండే నకిలీ వెబ్‌సైట్లు, యాప్స్ క్రియేట్ చేస్తున్నారు. “కేవలం ₹4,999 లకే 3 రోజులు గోవా ట్రిప్” అంటూ వచ్చే మెసేజ్‌లను నమ్మి అడ్వాన్స్ డబ్బులు కడితే ఆ తర్వాత ఫోన్లు స్విచ్ఛాఫ్ చేస్తారు. అందుకే ఎలాంటి టూర్స్ ప్లాన్ చేసినా సరే, అధికారిక వెబ్‌సైట్లలో మాత్రమే బుకింగ్స్ చేసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి అప్రమత్తం చేయండి.