ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మెరుగైన వైద్యం అందించేందుకు కుటుంబ సభ్యులు తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి తరలిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆసుపత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు. కొనకళ్ల నారాయణరావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అందిస్తున్న వైద్య చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.


