జగ్గయ్యపేట నియోజకవర్గం, జగ్గయ్యపేట మండలం, అనుమంచిపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ గ్రామ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి షేక్ మున్నీ (షేక్ పుల్లు సాహెబ్) మరియు వార్డు అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి షేక్ మున్నీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వార్డు అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు, ఓటర్లకు తన్నీరు నాగేశ్వరరావు గారు విజ్ఞప్తి చేశారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పార్టీ అభ్యర్థులకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


