tangirala soumya
సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ గార్లను శాసనసభలో సత్కరించి tangirala soumya అభినందించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు..
శుభాకాంక్షలు
తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నిక కాబడిన సానా సతీష్ గారు, భాష్యం రామకృష్ణ గారు, చింతకాయల విజయ్ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు నేడు రాష్ట్ర శాసనసభలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజా సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టి
ఉదయం 11 గంటలకు జరిగిన నామినేషన్ కార్యక్రమం సందర్భంగా నూతన రాజ్యసభ సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే సౌమ్య గారు, పార్టీ అధినేత మరియు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో అనుభవం, సామర్థ్యం, పార్టీ పట్ల అంకితభావం కలిగిన నాయకులకు అవకాశం కల్పించారని పేర్కొన్నారు. రాజ్యసభ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి అవసరాలు, tangirala soumya ప్రజా సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఈ ముగ్గురు నాయకులు కీలక పాత్ర పోషిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

కేంద్ర-రాష్ట్ర సంబంధాల బలోపేతంతో పాటు రాష్ట్రానికి మరిన్ని నిధులు, ప్రాజెక్టులు సాధించడంలో సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.
తెలుగుదేశం పార్టీ దేశ రాజకీయాల్లో మరింత బలమైన స్వరం వినిపించేలా నూతన రాజ్యసభ సభ్యులు తమ సేవలు అందించాలని కోరుతూ వారికి మరోసారి అభినందనలు తెలిపారు.
Keep Reading (ఇవి కూడా చదవండి):
Tangirala Soumya: రైతన్న బాగుంటేనే సమాజం బాగుంటుంది: గండేపల్లిలో వైభవంగా పాస్ పుస్తకాల పంపిణీ.. పాల్గొన్న ఎమ్మెల్యే తంగిరాల సొమ్య!
Amaravati Politics: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు: అమరావతి రాజధాని పనులపై కీలక ప్రకటన చేసిన కూటమి ప్రభుత్వం!
Chandrababu Naidu: విశ్లేషణ: ఢిల్లీ రాజకీయాల్లో సరికొత్త వ్యూహాలు.. నూతన రాజ్యసభ ఎన్నికల్లో చంద్రబాబు మార్క్ సెలక్షన్ ఇదే బాస్!