Devineni Uma

Devineni Uma : గుడిమెట్ల కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తా.. మాజీ మంత్రి దేవినేని ఉమా హామీ!

ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు : కృష్ణానది పరివాహక ప్రాంతాలను అభివృద్ధి చేసే విధంగా, ఆధ్యాత్మిక వెల్లువిరిసే విధంగా, రవాణా అవసరాలకు శాశ్వత పరిష్కారమే కృష్ణా న‌దిపై వంతెన నిర్మించ‌డం అని దాని కోసం కృషి చేస్తాన‌ని ఇదే లక్ష్యంగా గుడిమెట్ల వద్ద వంతెన నిర్మాణానికి తన వంతు ప్ర‌య‌త్నం, కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి Devineni Uma ఉమామహేశ్వరరావు హామీ ఇచ్చారు. ఆదివారం చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలోని ప్రసిద్ధ ద్వారక శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన దర్శించారు. అనంత‌రం ప్రత్యేక పూజా కార్య‌క్ర‌మాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి చారిత్రాత్మక ప్రాశస్త్యాన్ని, అలాగే కృష్ణానది ఆవలి గట్టుపై ఉన్న కాలభైరవ స్వామి ఆలయం గురించి మాజీ మంత్రి ఉమాకి వివరించారు.

ప్రజాప్రతినిధులతో ఫోన్‌లో మాట్లాడిన మాజీ మంత్రి

ఈ రెండు పవిత్ర ఆలయాలను దృష్టిలో పెట్టుకుని వీటిని అనుసంధానం చేస్తూ గుడిమెట్ల వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మించాలని స్థానిక ప్రజలు, భక్తులు ఆయ‌న‌ను కోరగా Devineni Uma ఉమా సానుకూలంగా స్పందించ‌డం జ‌రిగింది. ఆయన అక్కడి నుంచే పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మ‌రియు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో ఫోన్‌లో మాట్లాడి స్థానిక‌ పరిస్థితులను వివరించారు. అలాగే నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ (చిన్ని) లతో కూడా ఈ అంశంపై సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రజాప్రతినిధులందరూ సమన్వయంతో ముందుకు వచ్చి ఈ వంతెన నిర్మాణానికి స‌హాయ స‌హ‌కారాలు అందించాల‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న సూచించారు.

Devineni Uma gudimetla
Devineni Uma gudimetla

పుష్క‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని..

ఈ సందర్భంగా మాజీ మంత్రి ఉమా మాట్లాడుతూ వంతెన నిర్మాణం వల్ల భక్తులకు సౌకర్యంగా ఉంటుంద‌ని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండు జిల్లాల మధ్య రవాణా సదుపాయాలు మెరుగుప‌డ‌తాయ‌ని మ‌రెన్నొ ప్ర‌యోజ‌నాలు చేకూర‌తాయ‌ని ఆయ‌న‌ తెలిపారు. రాబోయే పుష్కరాల నాటికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన మౌలిక వసతులు కల్పించే విధంగా స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో చర్యలు చేపట్టనున్నట్లు ఈ సంద‌ర్భంగా ఆయ‌న వెల్లడించారు. గుడిమెట్ల ప్రాంతం ఎంతో ఆధ్యాత్మికత‌ను క‌లిగి ఉంద‌ని, ఎంతో చ‌రిత్ర ఇక్క‌డ దాగి వుంద‌ని తెలిపారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా ప్రోత్సహించేలా ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తానని Devineni Uma ఉమా స్థానికుల‌కు హామీ ఇచ్చారు. రామ‌న్న‌పేట (గుడిమెట్ల‌) వ‌ద్ద వంతెన నిర్మాణం కోసం మీరు ఎద‌రు చూస్తున్నారా అయితే కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెల‌పండి.

ఇవి కూడా చ‌ద‌వండి:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top