nandigama court
సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగించాలంటే ఆహార నియమాలను nandigama court పక్కాగా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) వారి నిబంధనల ప్రకారం సూచనలు, సలహాలు పాటిస్తేనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని నందిగామ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జి వందన పేర్కొన్నారు.
ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని పురస్కరించుకొని నందిగామ కోర్టు ప్రాంగణంలో నందిగామ మండల లీగల్ సర్వీస్ కమిటీ (MLSC) ఆధ్వర్యంలో ఆరోగ్య భద్రత ప్రమాణాలపై శనివారం ఒక ప్రత్యేక అవేర్నెస్ క్యాంప్‌ను నిర్వహించారు. ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ జ్యుడీషియల్ కోర్టు మెజిస్ట్రేట్ శ్రీమతి జి వందనా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు.
డేట్ ఆఫ్ ఎక్స్పైరీ తప్పనిసరిగా చూడాలి!
ఈ సందర్భంగా జడ్జి వందనా మాట్లాడుతూ.. మనం ప్రతిరోజు మార్కెట్లో కొంటున్న వంట గదిలో nandigama court ఉపయోగిస్తున్న నిత్యావసర వస్తువులు మరియు వంట సరుకులపై వినియోగదారులకు సరైన అవగాహన ఉండాలన్నారు. ప్యాకెట్లపై ఉన్న డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ (తయారీ తేదీ) మరియు డేట్ అఫ్ ఎక్స్పెరిటీ (గడువు ముగిసే తేదీ)ని తప్పకుండా చూసుకున్న తర్వాతే నాణ్యత కలిగిన వస్తువులనే కొనుగోలు చేయాలని సూచించారు. బజారులో నిత్యం కొంటున్న పండ్లు, వంట నూనెలు, డ్రై ఫ్రూట్స్, కూరగాయల విషయంలో మోసపోకుండా సరైన నాణ్యత ప్రమాణాలు పరిశీలించాలన్నారు. హోటళ్లు, రెస్టారెంట్ లలో లభించే జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉంటూ.. సాధ్యమైనంత వరకు అందరూ ఆర్గానిక్ (ప్రకృతి సిద్ధ) ఉత్పత్తులనే వాడాలని పిలుపునిచ్చారు.
కూరగాయలు, పండ్లపై కెమికల్స్ తొలగించుకునే చిట్కా..
ప్రస్తుత రోజుల్లో మార్కెట్లో దొరుకుతున్న పండ్లు, కూరగాయలపై రసాయనాల (కెమికల్స్) ప్రభావం ఎక్కువగా nandigama court ఉంటోందని జడ్జి ఆందోళన వ్యక్తం చేశారు. వీటి నుండి రసాయన తీవ్రతను తొలగించుకోవడానికి ఒక చక్కని గృహ చిట్కాను ఆమె వివరించారు. మనం బజారు నుండి తెచ్చిన లేదా ఫ్రిజ్ లో దాచిన కూరగాయలు, ఫ్రూట్స్ ను ఉపయోగించే ముందు.. గోరువెచ్చని నీటిలో కొంచెం సాల్ట్ (ఉప్పు), పసుపు వేసి అందులో ఒక అర్ధగంట పాటు ఉంచినట్లయితే వాటిపై ఉన్న ప్రమాదకర కెమికల్ ప్రభావం పూర్తిగా పోతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ చిన్న చిన్న ఆరోగ్య నియమాలను తెలుసుకుని, పాటిస్తే భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యవంతంగా ఉండవచ్చని ఆకాంక్షించారు.
ఈ ముఖ్యమైన అవగాహన కార్యక్రమంలో nandigama court బార్ అసోసియేషన్ కార్యదర్శి సిహెచ్ రామారావు, జిల్లా కోర్టు ఏపీపీ కాట్రా సత్యనారాయణ, గోపు శ్రావణ్ కుమార్, అద్దంకి మణిబాబు, వేల్పుల ప్రభాకర్ రావు పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లా కోర్టు ఏవో లక్ష్మి, సబ్ కోర్టు ఏవో రవికుమార్, అడిషనల్ కోర్టు ఏవో శ్రీనివాసరావు, ఎంఎల్‌ఎస్‌సి ప్రతినిధి గంగా జ్యోతి మరియు వివిధ కోర్టులకు చెందిన సిబ్బంది, పలువురు లాయర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి (మా వెబ్సైట్ లింకులు):
స్థానిక వార్తలు: నందిగామ నియోజకవర్గంతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని తాజా వార్తల లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి!
ఆరోగ్య సమాచారం: ఆరోగ్యంగా జీవించడానికి నిపుణులు చెబుతున్న బెస్ట్ హెల్త్ టిప్స్ మరియు ఆసక్తికర కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!
తాజా నేర వార్తలు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న క్రైమ్ అప్డేట్స్ మరియు కోర్టు కేసుల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!