ఎన్‌డిజి క్రైమ్: మనవత్వం మంటగలిసి పోతుందా.. మనిషి ఇంతలా దిగజారతాడా.. చిన్న పిల్లలు అని చూడరా… జాలి, దయ లాంటివి ఏవి లేవా.. అంటూ పలువురు దుమ్మెత్తిపోస్తున్నారు. దేశం తల దించుకునే సంఘటన జరిగింది.
ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో మానవత్వాన్ని నిలువునా పూడ్చిపెట్టే ఒక అమానవీయ, అత్యంత హేయమైన సంఘటన వెలుగుచూసింది. తనను పెళ్లి చేసుకోవడానికి ఒక మహిళ నిరాకరించిందనే కక్షతో, ఎంత Firozabad Crime దారుణానికి పాల్పడ్డాడో ఇదిచదివితే మీకే అర్థం అవుతుంది. ఒక తల్లికి సంబంధించిన కేవలం ఒకటిన్నర సంవత్సరం అంటే 1.5 నెలల వయసున్న పసికందును ఒక ఉన్మాది అత్యంత పాశవికంగా నేలకేసి కొట్టి చంపిన దురదృష్టకర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ హృదయ విదారక ఘటన స్థానికంగానే కాకుండా దేశం తలదించుకునే విధంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
కుటుంబ వివాదాలు
పోలీసుల విచారణ తర్వాత స్థానికుల ప్రకారం బదాయూ ప్రాంతానికి చెందిన సునీత్, అతని భార్య రతి దేవిల మధ్య గత కొంతకాలంగా తీవ్రమైన కుటుంబ మరియు వివాదాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో మనస్పర్థలు Firozabad Crime రావడంతో రతి దేవి తన ఒకటిన్నర సంవత్సరాల కుమారుడు ఆర్య (కల్లు) తో కలిసి ఫిరోజాబాద్ జిల్లా అరావ్ లోని తన పుట్టింటి వద్ద ఉంటుంది. అక్కడ తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది.
సహాయం పేరుతో ఉన్మాదం
రతి దేవి పుట్టింటికి వచ్చిన తర్వాత ఆమె బంధువు అయిన జితేంద్ర పాఠక్ (విరాజ్) అనే వ్యక్తి ఆమెకు మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. రతి దేవి ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యల్లో తనకు తోడుంటానని తెలిసిన వారి ద్వారా సహాయం చేస్తానంటూ నమ్మించాడు. ఈ క్రమంలోనే ఆమెను పెళ్లి చేసుకోవాలని వేధించడం మొదలుపెట్టాడు. అయితే రతి దేవి అతని మాటలు పెడచెవిన పెట్టింది. ప్రతిపాదనను నిరాకరించింది. దీంతో తీవ్ర కక్ష పెంచుకున్న విరాజ్.. ఆమె పసిబిడ్డను తన పెళ్లికి అడ్డుగా భావించాడు. క్రూరమైన పని చేశాడు.
శనివారం మధ్యాహ్నం రతి దేవి తన తల్లి మరియు బిడ్డతో కలిసి మరో బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో నిందితుడు విరాజ్ అక్కడకు చేరుకున్నాడు. అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా పసికందును లాక్కుని Firozabad Crime అత్యంత కిరాతకంగా నేలకేసి కొట్టాడు. తీవ్ర గాయాలైన పసిబిడ్డ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘోరానికి ఒడిగట్టిన నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఫిరోజాబాద్ పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
