ఈ సమాజంలో కొన్ని సంఖ్యలకు విపరీతమైన గుర్తింపు ఉంటుంది. number 786 అలాంటి వాటిలో చెప్పకోదగ్గవి నం. 786 అత్యంత ముఖ్యమైనది. కరెన్సీ నోట్లపై ఈ నంబర్ ఉంటే వేలకు వేలు ఖర్చు పెట్టి మరి కొనేవారు చాలా మంది ఉన్నారు అంత క్రేజ్ ఈ నంబరుకి తమ వాహనాలకు ఈ నంబరు కావాలని రిజిస్ట్రేషన్ కోసం లక్షలు ఖర్చుపెట్టేవారు చాలా మంది మనకు ఏదోఒక సందర్భంలో కనిపిస్తారు. అంత పవర్ ఉంటుంది ఈ నంబర్‌కు అసలు ఈ మూడు అంకెల వెనుక ఉన్న శక్తి ఏమిటి.. ఆధ్యాత్మిక ఏమిటి number 786 చారిత్రక మరియు సాంస్కృతిక రహస్యాలు ఏమిటి? అనేవి తెలుసుకోవాలి. కేవలం ఇస్లాం మతానికే పరిమితం అనుకునే ఈ సంఖ్యకు భారతీయ సనాతన సంప్రదాయానికి ఏమైనా సంబంధం ఏమైనా ఉందా? ‘ఎన్‌డీజీ న్యూస్ మీడియా’ జరిపిన ప్రత్యేక ఇన్వెస్టిగేటివ్ కథనం ఇక్కడ చూడండి.
అరబిక్ సంఖ్యా శాస్త్రం ప్రకారం (The Mathematical Base):
ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఖ్యకు ఇస్లాం మతంలో ఉన్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ‘అబ్జద్’ (Abjad) అనే పురాతన అరబిక్ సంఖ్యా శాస్త్ర పద్ధతిని నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఇస్లామిక్ సాంప్రదాయం ప్రకారం ఏ పని ప్రారంభించినా ‘బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ అంటే (అనంత కరుణామయుడు, అపార కృపామయుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను) అని పఠిస్తారు. ఇది మీరు వినే ఉంటారు.
పురాతన అరబిక్ భాషలోని ప్రతి అక్షరానికి ఒక నిర్దిష్టమైన సంఖ్యా విలువ (Numeric Value) చెప్పబడుతుంది. ఈ అబ్జద్ గణన పద్ధతి ప్రకారం.. ‘బిస్మిల్లా…’ అనే పవిత్ర వాక్యంలో ఉపయోగించిన అన్ని అరబిక్ అక్షరాల యొక్క విలువులను ఒకదానికొకటి కూడితే (కలపగా) వచ్చే మొత్తం సంఖ్యే ఈ 786. ముస్లిం సమాజంలో పవిత్రమైన దైవ బలం పేరు ఇది. ఈ నంబరు ఉన్న కాగితాలు కింద పడినా లేదా అపవిత్రమైన ప్రదేశాలలో ఉంచినా దైవనింద (అవమానం) జరుగుతుందనే భావన వీరిలో ఉంటుంది. అందుకే దానికి ప్రత్యామ్నాయంగా ఉత్తరాలు, ఆహ్వాన పత్రికలు, వ్యాపార బోర్డులపై ఈ number 786 ను రాయడం ఒక సాంప్రదాయంగా మార్చబడింది. ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ఖురాన్‌లో ఎక్కడా నేరుగా ఈ సంఖ్య ప్రస్తావన లేదని ఇది పూర్తిగా గణిత శాస్త్ర విశ్లేషణ ఆధారంగా ఏర్పడిన నమ్మకమని పరిశోధకులు స్పష్టం చేసి చెబుతున్నారు.
ఓంకారంతో పోలిక ఏమిటి..!
అనేక పరిశోధనలో తేలిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సంఖ్య కేవలం ఒక వర్గానికే పరిమితం కాలేదని తెలుస్తోంది. భారతీయ సంఖ్యా శాస్త్రజ్ఞులు మరియు కొందరు వేద పరిశోధకులు దీనిని సనాతన ధర్మంతో కూడా ముడిపెట్టి రుజువు చేస్తున్నారు. హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ప్రణవ నాదం ఏమిటి అదే ‘ఓం’ (OM) ను సంస్కృతం లేదా ప్రాకృత లిపిలో రాసినప్పుడు, దాని రూపాన్ని నిశితంగా గమనిస్తే అది 7, 8, 6 అంకెల కలయికలా కనిపిస్తుందని మరి కొందరి వాదన.
ఇక్కడ మరొక ప్రసిద్ధ సాంప్రదాయ విశ్వాసం ఏమిటంటే ఇది శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించినదిగా కొంతమంది భావిస్తారు. కృష్ణుడు తన చేతిలో పట్టుకునే మురళి (పిల్లనగ్రోవి) కి ఆరు రంధ్రాలు ఉంటాయి. ఆయన తన రెండు చేతులలోని ఏడు వేళ్లతో ఆ రంధ్రాలను నియంత్రిస్తూ ఏడు స్వరాలను (అష్ట రాగాలలోని అంతర్భాగంగా) పలికిస్తారు. ఈ విశ్లేషణ ఆధారంగా ఏడు వేళ్లు, number 786 ఆరు రంధ్రాలు మరియు మురళీ నాదాన్ని సూచిస్తూ 786 గా కొందరు అభివర్ణిస్తారు. అయితే ఇవి ఖచ్చితమైన చారిత్రక ఆధారాలు లేనప్పటికీ తమ సమాజంలో భిన్న సంస్కృతుల మధ్య సామరస్యానికి ఇదొక ప్రతీకగా ఉంటుందని చాలా మంది చెబుతారు.
సినిమా రంగంలో కూడా..
ఈ సంఖ్య సామాన్య ప్రజల్లోకి ఇంత బలంగా వెళ్లడానికి మరొక ముఖ్యమైన విషయం ఉంది. అది భారతీయ చలనచిత్ర పరిశ్రమ కూడా ఒక ప్రధాన కారణం. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘కూలీ’ లో ఆయన ధరించే బిల్లా number 786. సినిమాలో ఆ నంబర్ ఉన్న వ్యక్తిని ఏ శక్తీ ఏమీ చేయలేదనే కోణంలో చూపించడం వల్ల దానికి అంత గుర్తింపు వచ్చింది. అలాగే అది సాధారణ ప్రజల మనసుల్లో ఒక బలమైన ‘లక్కీ నంబర్’ గా ఇప్పటికీ నాటుకుపోయింది. ఆ తర్వాత వచ్చిన షారుఖ్ ఖాన్ ‘వీర్ జారా’ వంటి అనేక సినిమాల్లో కూడా దీనిని అదృష్టానికి చిహ్నంగా చూపించడం జరిగింది.
చివరిగా ఏం చెబుతుందంటే…
శాస్త్రీయంగా కోణంలో చూస్తే 786 అనేది గణితంలోని ఒక సంఖ్య మాత్రమే. కానీ మన సమాజంలో ఒక నమ్మకంగా ఏర్పడింది. అందుకే ఆ బలం బలపడినప్పుడు అది భౌతిక సరిహద్దులను దాటి జీవన జిధానంలోకి వస్తోంది. దైవ ప్రార్థనకు సంక్షిప్త రూపంగా ఇస్లాంలో ఈ నంబరు గుర్తింపు పొందడం అటు భారతీయ సంస్కృతిలోనూ దీనికి సానుకూల అర్ధాలు ఉండటం వల్లనే ఈ number 786 కు ప్రపంచవ్యాప్తంగా ఇంతటి పవిత్రత సంతరించుకుంది. ప్రజల్లో ఆదరణ లభించింది. ఏది ఏమైనప్పటికీ సమాజంలో సానుకూలతను నమ్మకాన్ని పెంచే ఏ భావన అయినా, ఏ నంబరు అయినా గౌరవించదగినదే అని ఈ పరిశోధన ద్వారా స్పష్టమవుతోంది. ఎన్‌డిజి న్యూస్ మీడియా విశ్లేషణ ఇది. ఈ విశ్లేషణ నచ్చితే కామెంట్ చేసి షేర్ చేయండి.
