NDG న్యూస్ : గ్యాస్ ధరలు సామాన్య ప్రజలను బెంబెలెత్తిస్తున్నయి. రోజు రోజుకు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
దేశ వ్యాప్తంగా ఎల్పీజీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు మరోసారి కేంద్రం పెంచింది. ప్రముఖ చమురు మార్కెటింగ్ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) సవరించిన ధరలను శనివారం నుంచే తక్షణమే అమలులోకి తేవడంతో వినియోగదారులు హడలిపోతున్నారు. కొత్త నిర్ణయం ప్రకారం, 19 కిలోల కమర్షియల్ gas cylinder పై రూ.42 వరకు ధరను పెంచుతున్నట్లు సంస్థ ప్రకటించింది. హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు చిన్న చిన్న వ్యాపారులపై ఈ పెరిగిన ధరల భారం పడనుంది.
ఎంత ధర పెరిగిందంటే..
దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ఈ పెంపుదల ప్రభావం కాస్త భిన్నంగా ఉంటుంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ కమర్షియల్ సిలిండర్ ధర చూస్తే అత్యధికంగా రూ.53.50 పైసల మేర పెరిగింది. అంతర్జాతీయ gas cylinder మార్కెట్‌లో ముడిచమురు ధరలు, ఇంధన మార్కెట్ హెచ్చుతగ్గుల ఆధారంగానే ఈ ధరల సవరణ జరిగినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే గృహ వినియోగదారులకు సంబంధించిన 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పు చేయకపోవడం కొంత సామాన్యులకు ఊరట కలిగించే అంశంగా కనిపిస్తోంది.
చిన్న సిలిండర్లపై కూడా..
పెద్ద కమర్షియల్ సిలిండర్లతో పాటు ఐదు కిలోల ప్రీట్రేడ్ ఎల్పీజీ సిలిండర్లపై కూడా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ధరను పెంచింనట్లు తెలుస్తోంది. వీటిపై రూ.11 మేర పెంపును విధించినట్లు ఇప్పటికే సంస్థ స్పష్టం చేసింది. gas cylinder తరచూ పెరుగుతున్న ఈ gas cylinder ధరల వల్ల వ్యాపార నిర్వహణ ఖర్చులు పెరిగి, పరోక్షంగా ఆహార పదార్థాల ధరలు కూడా పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ గ్యాస్ ధరల పెంపు వల్ల మిగతా వాటిపై కూడా దీని ప్రభావం పడనుంది. పెరుగుతున్న గ్యాస్ ధరలపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.
