Aditya Dhar

Aditya Dhar : దురంధర్స‌లో మొద‌ట రణవీర్ సింగ్ కాదు.. మ‌రి ఎవ‌రు!

ఎన్‌డిజి సినిమా : ఒక ప్రాంతాకికి ప‌రిమితం కాకుండా, టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ఇండియన్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ సరికొత్త రికార్డుల ప్ర‌భంజ‌నం సృష్టించిన భారీ బడ్జెట్ మల్టీస్టారర్ సినిమా దురంధర్. స్టార్ డైరెక్టర్ Aditya Dhar దర్శకత్వం వహించిన ఈ సినిమా పార్ట్-1 (డిసెంబర్ 2025), పార్ట్-2 (మార్చి 2026) లలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా సుమారు 3000 కోట్ల రూపాయల వసూళ్లూ రాబ‌ట్టి ప్రభంజనం సృష్టించింది. రణవీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా గురించి తాజాగా ఒక ఆసక్తికరమైన విష‌యం బయటకు లీక్ అయింది.

ర‌ణ్‌వీర్ కంటే ముందు వేరే యాక్ట‌ర్‌

ఈ చిత్రంలో రణవీర్ సింగ్‌ను ఎంపిక చేయడానికి చాలా సంవత్సరాల ముందే, దర్శకుడు Aditya Dhar ఒక ప్రముఖ సీనియర్ నటుడితో ఒప్పందం కుదుర్చుకున్నారనే విషయం మీలో ఎంత మందికి తెలుసు. ఈ విషయాన్ని సదరు సీనియర్ నటుడు రాకేష్ బేడీ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయ‌న ఎం చెప్పారంటే “నా నమ్మకం ఈ రోజు నిజ‌మైంది. ఆదిత్య నాతో చెప్పినట్లుగా ఈ సినిమా వ‌చ్చింది. ఈ సినిమాలో అందరికంటే ముందే నన్ను తీసుకున్నారు. మూడు నాలుగు సంవత్సరాల క్రితం జ‌రిగిన సంఘ‌ట‌న ఇది ఆయన ‘ఉరి’ సినిమా తీస్తున్న సమయంలోనే నన్ను ఈ క‌ధ కోసం ఎంచుకున్నారు. అప్పటికి ఆయన దగ్గర పూర్తి స్క్రిప్ట్ కూడా లేదు, కేవలం ఒక ఆలోచన మాత్రమే ఉండేది. ఆ ఆలోచన ఆధారంగానే నా నటనను చూసి ఈ పాత్రను నేను అయితే బాగుంటాన‌ని ఆయ‌న చెప్పారు. అని రాకేష్ బేడీ సంచలన విషయాలను బ‌య‌ట పెట్టెశారు.

ఓటీటీలోకి వ‌స్తోంది.. చూడండి ఇక‌..

వెండి తెర‌పై భారీ ఘ‌న విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ఈ సినిమా Aditya Dhar  ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయింది. చిత్ర నిర్మాతలు ఒక అరుదైన ‘రెండు రూట్లస ఎంచుకున్నారు. విడుదల ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ఈ ఆలోచ‌న చేశారు. అంతర్జాతీయ వెర్షన్ మే 22 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతుండగా.. భారతీయ ప్రేక్షకుల కోసం దేశీయ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జియో హాట్‌స్టార్స‌కు అప్ప‌జెప్పారు. సుమారు 150 కోట్లకు కొనుగోలు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఒక భారతీయ సినిమాకు జరిగిన అతిపెద్ద డీల్ ఇదే కావడం గ‌మ‌నార్హం. జూన్ 4 నుండి ‘దురంధర్ 2’ అదనపు సీన్లను క‌లిపి ఎక్స్‌టెండెడ్ డైరెక్టర్స్ కట్ వెర్షన్‌లో జియో హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. మ‌రి దురంధ‌ర్ ప్రేక్ష‌కులు Aditya Dhar థియేట‌ర్‌లో చూస్తేనే ఇంత‌లా ఉంటే ఇంకా కొత్త సీన్ల‌ను యాడ్ చేస్తే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి.

ఇవి కూడా చదవండి:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top