kanpur

kanpur : ఒక్క‌డి కోసం మొత్తం బెటాలియ‌న్ క‌దిలింది.

దేశ సరిహద్దుల్లో మ‌న కోసం ప్రాణాలు ప‌ణంగా పెట్టి సేవలు అందించే ఒక జవాన్ కుటుంబానికి జరిగిన ఘోర అన్యాయం ఇది. దేశవ్యాప్తంగా తీవ్ర దూమారం రేపుతోంది. త‌మ‌తో ప‌నిచేసే తోటి జవాన్‌కు అండగా నిలబడేందుకు ఏకంగా ఐటీబీపీ (ITBP) బెటాలియన్ మొత్తం రంగంలోకి దిగింది. ఉత్తరప్రదేశ్‌లోని kanpur (కాన్పూర్) పోలీస్ కమిషనరేట్‌ను చుట్టుముట్టడం సంచలనంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ వివ‌రాలు ఏంటో చూసేద్దామా..

మా అమ్మ చేతిని తీసేశారు.. జవాన్ క‌న్నీళ్లు.

ఐటీబీపీ జవాన్ వికాస్ సింగ్ మాట్లాడుతూ తల్లికి శ్వాసకోశ సమస్య రావడంతో కాన్పూర్‌లోని ఒక ఆసుపత్రికి తరలించామ‌ని అన్నారు. అయితే అక్కడ వైద్యుల నిర్లక్ష్యం వల్ల త‌న త‌ల్లికి సరైన చికిత్స అందించ‌లేద‌ని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చివరకు పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆమె చేయిని తొలగించాల్సి వచ్చింద‌ట‌.అయితే మా అమ్మ “ఈ చేత్తోనే నాకు అన్నం పెట్టింది…” అంటూ ఆ జవాన్ కన్నీరు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అంద‌రినీ క‌దిలించింది. ఇక్క‌డే అస‌లు క‌థ మొద‌లైంది.

మూడు రోజులు తిరిగినా నో ఎఫ్‌ఐఆర్!

ఈ ఘటనలో ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కేసు నమోదు చేయాలని జవాన్ వికాస్ సింగ్ పోలీసులను కోరాడు. అయితే ఇందులో అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే మూడు రోజుల పాటు ఎఫ్‌ఐఆర్ (FIR) కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా అధికారులు కేసు నమోదు చేయలేదు స‌రిక‌దా స‌రిగా స్పందించ‌డ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. దీనిపై భిన్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్య‌వ‌స్థ‌ ఇంత నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో సదరు జవాన్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.

kanpur
kanpur

అమ్మ చేతితోనే కమిషనర్ ఆఫీస్‌కు!

న్యాయం కోసం చివరకు ఆ జవాన్ తన తల్లి నుంచి తొల‌గించిన చేతితో నేరుగా kanpur పోలీస్ కమిషనర్ ఆఫీస్‌కు వెళ్లాడు. ఈ విషయం తెలియడంతో తోటి సైనికుడికి అన్యాయం జరిగిందని ఆగ్రహించిన ఐటీబీపీ బెటాలియన్ భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కమిషనరేట్ కార్యాలయాన్ని జవాన్లు చుట్టుముట్టడంతో పోలీసులు ఒక్కసారిగా అవాక్క‌య్యారు. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్గా మారాయి.
దేశాన్ని కాపాడే ఒక జ‌వాను కుటుంబానికే వ్యవస్థల్లో న్యాయం జ‌ర‌గ‌కపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని సోషల్ మీడియాలో నెటిజన్లు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై మీ అభిప్రాయం తెల‌పండి.

ఇవి కూడా చ‌ద‌వండి:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top