Bhimavaram Toll Gate Fire Accident Jaggaiahpet MLA Sriram Rajagopal

Fire Accident : రంగంలోకి మినీ ఫైర్ ఇంజ‌న్లు.. ఫ‌లించిన ఎమ్మెల్యే కృషి

ఎండ‌లు మండిపోతున్న సంగ‌తి తెలిసిందే.. ప్ర‌జ‌లు ఉక్క‌పోత‌తో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ నేప‌ధ్యంలో ర‌హ‌దారిపై వెళ్లాలంటేనే భ‌యమేసే ప‌రిస్థ‌తి ఏర్ప‌డింది. ఇలాంటి త‌రుణంగా జాతీయ ర‌హ‌దారిపై ఒక్క‌సారిగా Fire Accident మంట‌లు వ్యాపించాయి. భీమవరం టోల్‌గేట్ వద్ద భారీ అగ్నిప్రమాదం జ‌రిగింది. స‌మాచారం అందుకున్న ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య వెంట‌నే సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. కృష్ణా జిల్లా వత్సవాయి మండలం పరిధిలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భీమవరం చిల్లకల్లు జాతీయ రహదారిపై ఉన్న టోల్‌గేట్ సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనలన‌కు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే జగ్గయ్యపేట శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) అత్యవసరంగా స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని స్వయంగా సహాయక చర్యలను భాగం పంచుకున్నారు.

కిలోమీటర్ మేర మంటలు.. దట్టమైన పొగ

జాతీయ రహదారి ఇరువైపులా ఎండిపోయి ఉన్న చెట్లు, పొదలు, కొమ్మలకు ఉంటంతో గుర్తు తెలియని వ్యక్తులు నిర్లక్ష్యంగా నిప్పు పెట్టడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాధ‌మిక విచార‌ణ‌లో తెలుస్తోంది. ఎండ తీవ్రత అధికంగా ఉండ‌టం వ‌ల్ల‌ మంటలు క్షణాల వ్యవధిలో దాదాపు కిలోమీటర్ మేర వ్యాపించాయి. భారీగా పొగలు కమ్ముకోవడంతో టోల్‌గేట్ పరిసర ప్రాంతమంతా దట్టమైన పొగ‌మంచులాగా మారిపోయింది. పొగ కారణంగా హైవేపై వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాలు అక్కడికక్కడే నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

ఎమ్మెల్యే తొర‌వ‌తో రంగంలోకి మినీ ఫైర్ ఇంజన్లు..

ప్రమాదం మరింతగా పెరుగుతూ ఉండ‌టంతో టోల్‌గేట్ సిబ్బంది వెంటనే జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యకి సమాచారం ఇచ్చారు. ఇటీవల తన సొంత సూచనలతో గ్రామీణ ప్రాంతాల కోసం తయారు చేయించిన ప్రత్యేక “మినీ ఫైర్ ఇంజన్లను” యుద్ధప్రాతిపదికన ఈ సంఘటన స్థలానికి తరలించారు. వీటితో పాటు రాంకో సిమెంట్స్ సంస్థకు చెందిన నీటి ట్యాంకర్లను కూడా అక్క‌డికి రప్పించారు.

Bhimavaram Toll Gate Fire Accident Jaggaiahpet MLA Sriram Rajagopal
Bhimavaram Toll Gate Fire Accident Jaggaiahpet MLA Sriram Rajagopal

అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ శాఖ, టోల్‌గేట్ సిబ్బంది సమన్వయంతో మంటలను అదుపు చేయ‌డానికి విశ్వ‌ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య స్వయంగా మినీ ఫైర్ ఇంజన్ల వద్దే నిలబడి, అగ్నిమాపక సిబ్బందితో Fire Accident పాటు కలిసి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్ర‌త్నించారు. ఎమ్మెల్యే తక్షణమే స్పందించి మినీ ఫైర్ ఇంజన్లను పంపడం వల్లే ప్రమాదం అక్క‌డితో ఆగిపోయింద‌ని లేకుంటే భారీ న‌ష్టం జ‌రిగేద‌ని స్థానికులు అంటున్నారు.

ప్రతి పంచాయితీకి ఒక మినీ ఫైర్ ఇంజన్ : ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య

మంటలు పూర్తిగా అదుపులోకి తెచ్చిన అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మీడియాతో మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఆకస్మిక ప్రమాదాలు జరిగినప్పుడు పెద్ద ఫైర్ ఇంజన్లు వచ్చేలోపు భారీ నష్టం జరుగుతుందన్నారు. అందుకే ప్రతి గ్రామ పంచాయితీ పరిధిలో మినీ ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. చిన్న మంటలు పెద్ద విపత్తుగా మారకముందే అదుపు చేయడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడటంలో వేగంగా స్పందించడమే ముఖ్యమని పేర్కొన్నారు.

ఈ ఆపరేషన్‌లో పనిచేసిన అగ్నిమాపక శాఖ, పోలీస్ సిబ్బంది, రాంకో సిమెంట్స్ ప్రతినిధులను ఎమ్మెల్యే ప్ర‌త్యేకంగా అభినందించారు.

ఇవి కూడా చదవండి (Recent Links)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top