మీకు ఆధార్ కార్డు ఉందా అయితే గుడ్ న్యూస్. ఉచితంగా ఆధార్ కార్డుని అప్‌డేట్చేసుకోవడానికి గడువు పొడిగించారు. ఇది చాలా మంది కలిసివచ్చే అంశం. ఎందుకంటే మీరు ఫ్రీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. చివరి తేదీతో పాటు పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. భారతదేశంలో ఆధార్ కార్డ్ కలిగిన కోట్ల మంది ప్రజలకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక నిర్ణయం ప్రకటించింది. గత కొంతకాలంగా కొనసాగుతున్న ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువును మరోసారి కేంద్రం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం, పౌరులు తమ ఆధార్ కార్డులోని వివరాలను ఎటువంటి ఫీజు Free Aadhaar Update చెల్లించకుండా ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. జూన్ 14 2027 వరకు పొడిగించింది.
‘myAadhaar’ పోర్టల్ ద్వారా ఉచితంగా సేవలు
ఆధార్ కార్డును జారీ చేసి పదేళ్లు దాటిన వారు మరియు అలాగే తమ చిరునామా లేదా గుర్తింపు పత్రాలను మార్చుకోవాలనుకునే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. కార్డుదారులు తమ గుర్తింపు పత్రం (Proof of Identity), చిరునామా పత్రం (Proof of Address) లని UIDAI అధికారిక వెబ్‌సైట్ అయిన ‘myAadhaar’ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో సులభంగా అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆన్‌లైన్ ప్రక్రియకు ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవని స్పష్టం చేశారు.
ఆధార్ కేంద్రాలకు వెళ్తే ..
ఇక్కడ ఆధార్ కార్డుదారులు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ Free Aadhaar Update Deadline Extended వెసులుబాటు కేవలం ఆన్‌లైన్ ద్వారా సొంతంగా చేసుకునే సేవలకు మాత్రమే వర్తిస్తుంది. అలా కాకుండా మీరు నేరుగా మీ సమీపంలోని మీ సేవా కేంద్రాలకు లేదా అధికారిక ఆధార్ సేవా కేంద్రాలకు (Aadhaar Centers) వెళ్తే మాత్రం అక్కడ బయోమెట్రిక్ లేదా డాక్యుమెంట్ అప్‌డేట్ కోసం ప్రభుత్వం నిర్ణయించిన నిర్ణీత రుసుమును కచ్చితంగా చెల్లించాల్సి ఉంటుందని UIDAI అధికారులు స్పష్టం చేశారు.

ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడం ఎలా?
మీరు ఇంట్లోనే కూర్చుని మీ మొబైల్ లేదా లాప్‌టాప్ ద్వారా ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవడానికి Free Aadhaar Update ఈ క్రింది పద్ధతిని ఫాలో అవండి.
- మొదట అధికారిక myaadhaar.uidai.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
- మీ ఆధార్ నంబర్ మరియు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTP సహాయంతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
- అక్కడ కనిపించే ‘Document Update’ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
- మీ రేషన్ కార్డ్, ఓటర్ ఐడీ, లేదా పాన్‌కార్డ్ వంటి పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
- వివరాలన్నీ సరిచూసుకున్న తర్వాత సబ్మిట్ చేస్తే మీ ఆధార్ ఉచితంగా అప్‌డేట్ అయిపోతుంది.
ప్రభుత్వ పథకాల లబ్ధిని పొందడానికి, అలాగే బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండటానికి గడువు ముగిసేలోపే మీ ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవడం మంచిదని ముందస్తుగా Free Aadhaar Update అధికారులు చెబుతున్నారు.