Legal Awareness
Legal Awareness నేటి బాలలే రేపటి పౌరులని, విద్యార్థులు క్రమశిక్షణ, ఉన్నతమైన కృషి, పట్టుదల, సంకల్పంతో ఉన్నత స్థాయికి ఎదగాలని నందిగామ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీ షేక్ రియాజ్ పేర్కొన్నారు. మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి (నవంబర్ 14) పురస్కరించుకుని ఉదయం 9 గంటలకు నందిగామ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో Legal Awareness సదస్సు నిర్వహించారు. నందిగామ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ మరియు 16వ అదనపు జిల్లా జడ్జి శ్రీ పి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జడ్జి షేక్ రియాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జడ్జి షేక్ రియాజ్ మాట్లాడుతూ
ఈ సందర్భంగా జడ్జి షేక్ రియాజ్ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడే ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు గౌరవం పెరుగుతుందని, సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఆధునిక యుగంలో విద్యార్థులు మేధోశక్తిని పెంపొందించుకుని సామాజిక పరిస్థితులు, రాజ్యాంగం కల్పించిన బాలల హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. తెలిసీతెలియని వయసులో మత్తుకు బానిసై జీవితాలు నాశనం చేసుకోవద్దని, 18 ఏళ్లు నిండే వరకు డ్రైవింగ్ చేయరాదని హితవు పలికారు. ముఖ్యంగా బాలికలు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే వెంటనే సంబంధిత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు లేదా పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని ఈ Legal Awareness కార్యక్రమంలో చట్టాల పట్ల అవగాహన కల్పించారు.

సత్ప్రవర్తన అలవర్చుకోవడం ద్వారా
విద్యార్థి దశ నుంచే సత్ప్రవర్తన అలవర్చుకోవడం ద్వారా ఉత్తమ పౌరులుగా ఎదగవచ్చని వక్తలు పేర్కొన్నారు. ఈ Legal Awareness సదస్సులో నందిగామ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చెరుకుపల్లి రామారావు, బార్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శెట్టి వెంకటేశ్వరరావు, మాజీ ప్రధాన కార్యదర్శి అద్దంకి మణిబాబు, న్యాయవాదులు కొమ్మినేని మౌళేశ్వరరావు, షేక్ దాదా హుస్సేన్, అప్పాజీ, షేక్ దాదాసాహెబ్ పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి విజయలక్ష్మి, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో హాజరయ్యారు.
– దామాల నరసింహారావు, సీనియర్ జర్నలిస్ట్


