Karthika Deepotsavam
శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర కార్తీక మాసం ప్రారంభం కావడంతో ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని ప్రముఖ ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరుస్తున్నాయి. నేడు మధ్యాహ్నం నుంచి కార్తీక పాడ్యమి తిథి ప్రవేశించడంతో శివాలయాలన్నీ విద్యుత్ దీపాలంకరణలతో దేదీప్యమానంగా ముస్తాబయ్యాయి. ఈ సందర్భంగా నియోజకవర్గవ్యాప్తంగా నిర్వహించిన Karthika Deepotsavam లో భక్తులు విశేషంగా పాల్గొనడంతో ఆలయాలన్నీ ‘హర హర మహాదేవ.. శంభో శంకర’ శివనామస్మరణతో మార్మోగిపోతున్నాయి.
నందిగామ పట్టణంలోని ప్రసిద్ధ పంచలింగ క్షేత్రమైన శ్రీ శుఖ శ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆకాశ దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు దండిబోట్ల బాలకృష్ణ శాస్త్రి, యడవల్లి సాయి ప్రసాద్, యడవల్లి సీతారామ కృష్ణ ప్రసాద్ (వైఎస్సార్‌కే ప్రసాద్)ల పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు జరిగాయి. లోకకల్యాణార్థం వేదమంత్రోచ్ఛారణల నడుమ ధ్వజస్తంభంపై వెలిగించిన ఈ Karthika Deepotsavam ఆకాశ దీపాన్ని దర్శించుకునేందుకు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
కార్తీక మాసం ఆరంభం సందర్భంగా నందిగామ నియోజకవర్గ పరిధిలోని శైవక్షేత్రాల్లో నిత్య లఘున్యాస అభిషేకాలు, బిల్వార్చనలు మరియు ఆకాశ దీపారాధనలు నెల రోజుల పాటు కొనసాగనున్నట్లు అర్చక బృందం తెలిపింది. పాడ్యమి తిథి వేళ మహిళా భక్తులు ఆలయ ప్రాంగణాల్లో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ Karthika Deepotsavam వేడుకల కోసం ఆలయ కమిటీలు, అధికారులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇవి కూడా చదవండి:
• కార్తీక మాసంలో ఆకాశ దీపం విశిష్టత మరియు పూజా విధానం
• నందిగామ శ్రీ రామలింగేశ్వర స్వామి పంచలింగ క్షేత్ర మహత్యం
దామాల నరసింహారావు, సీనియర్ జర్నలిస్ట్


