iran

iran : యుద్ధం ముగిసినట్లేనా..

యుద్ధం ముగిసినట్లేనా.. ట్రంప్ ఇరాన్ శాంతి ఒప్పందం వెనుక అసలు నిజాలేంటి!
గత కొన్ని నెలలుగా మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన iran (ఇరాన్) – అమెరికా వివాదం ఇప్పుడు ఒక కీలక మలుపు తిర‌గ‌నుంది. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న త‌రుణంలో తాజాగా ఒక శాంతి ఒప్పందం (Peace Deal) కుదిరే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలు అంతర్జాతీయంగా చ‌ర్య‌నీయాంశంగా మారాయి.

పాకిస్తాన్ మధ్యవర్తిత్వం.. త‌లొగ్గిన‌ ఇరాన్?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరియు ఇరాన్ ప్రతినిధుల మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో రహస్య చర్చలు జరుగుతున్నట్లు కీల‌కంగా తెలుస్తోంది.

  • యురేనియం నిల్వలు: ఇరాన్ తన వద్ద ఉన్న అత్యంత శ‌క్తివంతమైన యురేనియం నిల్వలను వదులుకోవడానికి సూత్రప్రాయంగా అంగీకరించిందని ప్రాధ‌మికంగా సమాచారం అందుతుంది.
  • జలసంధి ఓపెన్: అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ (Strait of Hormuz) జలసంధిని తిరిగి తెరవడానికి ప్రతిపాదనలు కూడా సిద్ధమయ్యాయని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తుంది.
iran
iran

ఒక వైపు ఒప్పందం..

అయితే ఈ చర్చలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు అమెరికా ఈ ఒప్పందం దాదాపు ఖరారైందని చెప్తుంటే ఇరాన్‌కు చెందిన కొన్ని అధికారిక సంస్థలు మాత్రం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నియంత్రణ తమ చేతుల్లోనే ఉంటుందని చెబుతుంది. అమెరికా చెప్తున్న వార్తలు పూర్తిగా నిజం కావని అంటున్నాయి. మరోవైపు, యుద్ధ సమయంలో అమెరికా, ఇస్రాయెల్‌కు కీలక సమాచారం అందించాడనే ఆరోపణలతో iran ఒక వ్యక్తికి మరణశిక్ష కూడా అమలు చేయడం అక్కడ తీవ్ర సంచలనంగా మారింది.

దశాబ్దాలుగా నడుస్తున్న ఈ శత్రుత్వం ప్రస్తుత చర్చలతో ముగుస్తుందా లేదా మళ్లీ మొదటికొచ్చి యుద్ధానికి దారితీస్తుందా అనేది ప్రపంచ దేశాలలో ఇప్పుడు ఉత్కంఠత నింపుతుంది. ఒకవేళ ఈ శాంతి ఒప్పందం నిజంగానే సఫలమైతే గ్లోబల్ మార్కెట్లకు ముఖ్యంగా ముడిచమురు సరఫరాకు పెద్ద ఊరట ల‌భించినట్లే అని మార్కెట్‌ నిపుణులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి (Recent Links)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top