traffic constable
పోలీస్ అంటే కేవలం చలానాలు రాయడం, శాంతిభద్రతలు కాపాడటమే కాదు.. విపత్కర పరిస్థితుల్లో traffic constable ప్రజల ప్రాణాలు కాపాడే దేవుడు కూడా అని మరోసారి నిరూపించారు ఒక ట్రాఫిక్ పోలీస్. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సుధాకర్ గారు సమయస్ఫూర్తితో వ్యవహరించి, నడిరోడ్డుపై మూర్ఛ (ఫిట్స్) వచ్చి పడిపోయిన ఒక సాధారణ వ్యక్తి ప్రాణాలను సకాలంలో కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు.
సకాలంలో స్పందన.. ప్రాణాలు సేఫ్!
లభించిన సమాచారం ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి పరిధిలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా తీవ్రమైన traffic constable మూర్ఛ వ్యాధి (ఫిట్స్) బారిన పడి రోడ్డు పక్కన పడిపోయాడు. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సుధాకర్ గారు ఆ బాధితుడిని గమనించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించి, ఆ వ్యక్తికి ప్రాథమిక చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నారు. బాధితుడు పూర్తిగా కోలుకునే వరకు సుధాకర్ గారు దగ్గరుండి చూసుకున్నారు. ఆ వ్యక్తికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు కల్పించి, సురక్షితంగా కోలుకున్న తర్వాతే ఆయనను స్వయంగా ఇంటికి పంపించి పెద్ద మనసు చాటుకున్నారు.
వారం రోజుల క్రితమే మరో సాహసం..
కానిస్టేబుల్ సుధాకర్ గారు ఇలాంటి సాహసోపేతమైన సామాజిక సేవ చేయడం ఇదే మొదటిసారి traffic constable కాదు బాస్. కేవలం వారం రోజుల క్రితం కూడా ఇబ్రహీంపట్నం హైవేపై ఒక కారు డోర్ లు ఆటోమేటిక్ గా లాక్ అయిపోయి.. ఊపిరాడక లోపల కొట్టుమిట్టాడుతున్న ప్రయాణికులను సుధాకర్ గారు గమనించారు. అప్పుడు కూడా ఎంతో చాకచక్యంగా వ్యవహరించి, కారు లాక్ ఓపెన్ చేసి లోపల చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడారు.
సమాజంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే మాటకు నిజమైన అర్థం చెబుతూ.. వరుసగా traffic constable ప్రజల ప్రాణాలను కాపాడుతున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సుధాకర్ గారిపై ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, స్థానిక ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇలాంటి రియల్ హీరోలు పోలీస్ శాఖలో ఉండటం గర్వకారణమంటూ అభినందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
స్థానిక వార్తలు: ఇబ్రహీంపట్నం, నందిగామ నియోజకవర్గాలతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని తాజా వార్తల లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి!
తాజా నేర వార్తలు: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, క్రైమ్ అప్డేట్స్ మరియు పోలీస్ శాఖ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి!
ఆరోగ్య సమాచారం: హఠాత్తుగా ఎవరికైనా మూర్ఛ లేదా ఫిట్స్ వస్తే ప్రాణాలు కాపాడటానికి చేయాల్సిన అత్యవసర చిట్కాలు ఇక్కడ చూడండి!