జగ్గయ్యపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో అల్ట్రాటెక్ సిమెంట్స్ సంస్థ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల ద్వారా రూ.5.75 లక్షల వ్యయంతో నూతనంగా jaggaiahpet నిర్మించిన రక్షిత త్రాగునీటి (ఆర్వో) వాటర్ ప్లాంటును జగ్గయ్యపేట శాసనసభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, అల్ట్రాటెక్ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ప్రయాణికులు పాల్గొన్నారు.
స్వచ్ఛమైన తాగునీరే లక్ష్యం
ముందుగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ఆర్వో వాటర్ ప్లాంట్ వద్ద యూనిట్ హెడ్ వరదరాజ శివరాజన్తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి ప్లాంట్ పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం అత్యంత ప్రాధాన్యమైన సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. రోజూ వేలాది jaggaiahpet మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే జగ్గయ్యపేట ఆర్టీసీ బస్టాండ్‌లో ఈ రక్షిత త్రాగునీటి ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రయాణికులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. వివిధ గ్రామాలు, మండలాలు మరియు పట్టణాల నుంచి ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చే ప్రజలు ఇకపై సురక్షితమైన, నాణ్యమైన తాగునీటిని ఉచితంగా పొందగలరని ఆయన అన్నారు.
ఆరోగ్య భద్రత
ప్రజల ఆరోగ్య పరిరక్షణకు స్వచ్ఛమైన తాగునీరు ఎంతో అవసరమని అలాంటి అవసరాన్ని గుర్తించి అల్ట్రాటెక్ సంస్థ ఈ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. అల్ట్రాటెక్ సంస్థ సామాజిక సేవా కార్యక్రమాల పట్ల ఎల్లప్పుడూ ముందుంటుందని ఎమ్మెల్యే కొనియాడారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కోసం షెడ్లు నిర్మించడం పాఠశాలలు మరియు ఇతర ప్రభుత్వ సంస్థలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం జరిగిందన్నారు. ప్రహరీ గోడల నిర్మాణం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. విద్య, ఆరోగ్యం, తాగునీరు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి రంగాల్లో అల్ట్రాటెక్ అందిస్తున్న సహకారం సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం మరియు అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వంతో పాటు కార్పొరేట్ సంస్థలు కూడా సామాజిక బాధ్యతతో ముందుకు రావడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని ఎమ్మెల్యే తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజోపయోగ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని అల్ట్రాటెక్ ప్రతినిధులను కోరారు.

ఈ సందర్భంగా అల్ట్రాటెక్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సీఎస్ఆర్ నిధుల ద్వారా ఈ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు సంస్థ తనవంతు సహకారం అందిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీరాం చిన్నబాబు, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, కమిషనర్ తులసి కృష్ణారావు, అల్ట్రాటెక్ హెచ్ఆర్ హెడ్ మోహన్ కౌన్సిలర్స్ మరియు వివిధ హోదాలలో ఉన్న కూటమి నాయకులు, ఆర్టీసీ అధికారులు,ఆర్టీసీ యూనియన్ నాయకులు, అల్ట్రాటెక్ jaggaiahpet ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
