festival

festival : వెలది కొత్తపాలెంలో అంకమ్మ తల్లి తిరుణాల వైభవం!

మన ఊరు.. మన సంస్కృతి.. గురించి తెలుసుకుందాం.. ఎంతైనా ప‌ల్లె festival వాతావ‌ర‌ణంలో జ‌రిగే పండుగ‌ల ప్ర‌త్యేక‌తే వేరు. ఇప్ప‌డు వెలది కొత్తపాలెంలో అంకమ్మ తల్లి తిరుణాల వైభవంగా జ‌రుగుతున్నాయి ఆ తిరునాళ్ల‌ను చూద్దామా రండి.
ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం వెలది కొత్తపాలెం గ్రామంలో ఆధ్యాత్మిక శోభ అంబ‌రాన్ని అంటింది. గ్రామంలో వెలసిన శ్రీ వేలది అంకమ్మకి ప్ర‌తి ఏడాది విశేష పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. ఆ తల్లి తిరుణాల మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా మొద‌ల‌య్యాయి. మన ఊరు – మన సంస్కృతి – మన సంప్రదాయం ప్రతిబింబించేలా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఈ వేడుకలను అత్యంత భక్తి శ్ర‌ద్ధ‌ల‌తో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటారు.

ఐదు రోజుల పాటు ఘ‌నంగా వేడుకలు!

ఈ తిరుణాల మహోత్సవాన్ని మొత్తం ఐదు రోజుల పాటు శాస్త్రోక్తంగా జ‌రుపుతారు.

  • మొదటిరోజు ప్రత్యేకత: ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు అమ్మవారి ‘సత్తి కొలువు’ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి ఉత్సవాలకు భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో శ్రీకారం చుట్టారు.
  • భక్తుల కోలాహలం: అమ్మవారి ఆశీస్సుల కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. వెలది కొత్తపాలెం గ్రామం ఆద్యాత్మీక భ‌క్తిభావంతో పులకించిపోతోంది.
festival
festival

భారీగా భ‌క్తులు

గ్రామస్తులు, భక్తులు అందరూ కలిసికట్టుగా జరుపుకునే ఈ festival (పండుగ) కు ప్రతి ఒక్కరూ హాజరై, ఆ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ సభ్యులు భ‌క్తుల‌ను కోరారు. ఐదు రోజుల పాటు జరిగే వివిధ వాహన సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేసినట్లు కమిటీ ప్రతినిధులు వెల్లడించారు.

ఇవి కూడా చ‌ద‌వండి:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top