whitehouse

whitehouse : వైట్‌హౌస్ వ‌ద్ద కాల్పులు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు

అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్ whitehouse దాని పరిసరాల్లో తీవ్ర క‌ల‌క‌లం రేగింది. వైట్ హౌస్ వెలుపల తుపాకీతో కాల్పులకు తెగబడిన ఒక 21 ఏళ్ల యువకుడిని అక్కడి రక్షణా సిబ్బంది అక్క‌డిక్క‌డే కాల్చి చంపారు. ఈ దారుణ ఘటన అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు జాతీయ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అస‌లు ఏం జ‌రిగింది..?

ఒక్కసారిగా కాల్పులు.. స్పాట్‌లోనే మరణం!

పోలీసులు తెలిపిన‌ కథనం ప్రకారం.. మృతుడికి 21 ఏళ్ల వ‌య‌స్సు ఉంటుంది. అత‌ని పేరు నసీర్ బెస్ట్ (Naseer Best) గా గుర్తించారు.

దాడికి యత్నం: నిందితుడు వైట్ హౌస్ కాంప్లెక్స్ వెలుపల ఆయుధంతో అనుమానాస్పదంగా తిరుగుతూ ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడని వారు తెలిపారు.

కాల్చివేత: వెంటనే అలర్ట్ అయిన అమెరికా సీక్రెట్ సర్వీస్ బలగాలు అత‌నిపై ఎదురుకాల్పులు జరిపి ఆ వ్య‌క్తిని అక్కడికక్కడే మట్టుబెట్టాయి. అయితే ఇక్క‌డే అనుమానాలు క‌లుగుతున్నాయి.

whitehouse
whitehouse

గతంలోనూ చొరబాటు యత్నాలు.. భారీ కుట్ర?

అయితే సీక్రెట్ సర్వీస్ రికార్డులను పరిశీలించగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఈ దాడికి పాల్ప‌డిన నసీర్ బెస్ట్ అనే యువకుడు గతంలో కూడా పలుమార్లు whitehouse హై సెక్యూరిటీ జోన్ ప్రాంగణంలోకి అక్రమంగా చొరబడిన‌ట్లు తెలిసింది. దాడికి ప్రయత్నించినట్లు అధికారులు వెల్లడించారు. భద్రతా వలయాన్ని దాటి లోపలికి వెళ్లడానికి అతడు పదేపదే ఎందుకు ప్రయత్నించాడు?.. అతడి వెనుక ఏవైనా ఉగ్రవాద శక్తులు ఉన్నాయా? లేదా ప్రెసిడెంట్‌ను whitehouse టార్గెట్ చేస్తూ ఏదైనా భారీ ప్లాన్‌తోనే ఇదంతా చేశాడా?.. అనే కోణంలో కూడా అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు ప్రస్తుతం ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి. ఏది ఏమైన‌ప్ప‌టికీ ఈ ఘటన నేపథ్యంలో అక్కడి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

ఇవి కూడా చ‌ద‌వండి:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top