గుడివాడలో వెంకటేశ్వరస్వామి కిరీటాన్ని తాకట్టు పెట్టిన సంగతి మిలో చాలా మందికి తెలుసు. ఈ సంఘటనలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లా గుడివాడలో గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా, తీవ్ర సంచలనం రేపుతున్న కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ స్వర్ణ కిరీట వివాదం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. సుమారు 70 లక్షల రూపాయల విలువైన ఈ బంగారు కిరీటం తాకట్టులో ఉందనే వార్త భక్తులలో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ నేపథ్యంలో దేవస్థాన ట్రస్ట్ సభ్యులు రంగంలోకి దిగి, ఆ కిరీటాన్ని విడిపించి శుక్రవారం నాడు అధికారికంగా మీడియా ముందు ప్రవేశపెట్టారు.
అసలు కిరీటాన్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏంటి..?
మీడియా సమావేశంలో దేవస్థాన కమిటీ సభ్యులు మాట్లాడుతూ అసలు ఏం జరిగిందనే విషయాలను వివరించారు. ఆలయ ఆవరణలో జరుగుతున్న కళామందిర నిర్మాణ పనులకు అకస్మాత్తుగా నిధుల కొరత ఏర్పడిందని కమిటీ తెలిపింది. ఆ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే అత్యవసర నిధుల కోసం ఈ Gudivada Venkateswara Swamyను తాకట్టు పెట్టాల్సి వచ్చిందని వారు వెల్లడించారు. స్వామివారి సొమ్మును వేరే దేనికీ వాడలేదని, కేవలం ఆలయ అభివృద్ధి పనుల కోసమే వాడామని వారు చెబుతున్నారు.
చేసిన తప్పు ఒప్పుకున్న కమిటీ చైర్మన్.. క్షమాపణలు
దేవుడి నగలను తాకట్టు పెట్టడం సాంప్రదాయాల ప్రకారం మరియు చట్టప్రకారం తప్పు కావడంతో భక్తుల నుండి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. దీనిపై కమిటీ ఛైర్మన్ మోహనరావు స్పందిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తమకు లేదన్నారు. జరిగిన తప్పును క్షమించాలని స్వామివారి నగల రక్షణకు తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు. అధికారులు, గ్రామ పెద్దల సమక్షంలో ఈ సమస్యను పరిష్కరించుకోవడం సంతోషకరమన్నారు.

మళ్లీ స్వామి చెంతకు కిరీటం..
తాకట్టు నుండి విడిపించిన ఈ పవిత్రమైన Gudivada Venkateswara Swamy ను నేరుగా స్వామివారికి పెట్టకుండా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శనివారం ఉదయం ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపి ఆ తర్వాతే ఈ స్వర్ణ కిరీటాన్ని కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారికి తిరిగి అలంకరిస్తామని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ఈ వివాదం ముగియడంతో గుడివాడ వ్యాప్తంగా ఉన్న భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి సంఘటనలు మీ ఊరిలో జరిగాయా అయితే కామెంట్లో చెప్పండి.