Nandigama Weather Heat Wave Updates

Nandigama Weather : నందిగామ‌లో భానుడి భ‌గ‌.. భ‌గ‌లు

ఆంధ్రప్రదేశ్‌లో భానుడు భగభగమంటున్నాడు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ పరిధిలో ఎండ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. శుక్రవారం మధ్యాహ్నానికి నందిగామలో రికార్డ్ స్థాయిలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 8 గంటల నుంచే ఎండ సెగలు కక్కుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ జనసంచారం లేక నిర్జనంగా మారుతున్నాయి.

అల్లాడిపోతున్న నందిగామ ప్ర‌జ‌లు

తీవ్రమైన ఉష్ణోగ్రతలు మరియు ఉక్కపోత పెర‌గ‌టంతో నందిగామ పరిసర ప్రాంతాల ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు ఈ వాతావరణ మార్పుల వల్ల తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గ‌త రెండు మూడు రోజులుగా వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సామాన్య ప్రజలు, ద్విచ‌క్ర‌వాహ‌న ప్ర‌యాణ‌దారులు తీవ్ర‌ నరకం చూస్తున్నారు. ఈ తరుణంలో Nandigama Weather తీవ్రతపై వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Nandigama Weather Heat Wave Updates
Nandigama Weather Heat Wave Updates

వైద్యులు ఏం చెబుతున్నారు

నందిగామ నియోజ‌క‌వ‌ర్గంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో స్థానిక వైద్య నిపుణులు ప్రజలకు పలు కీలక సూచనలు జారీ చేశారు.

  • మధ్యాహ్న ప్రయాణాలు వ‌ద్దంటున్న అధికారులు : అత్యవసర పనులు ఉంటే తప్ప మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు ఇళ్ల నుండి బయటకు రాకపోవడం మంచిది కాద‌ని చెబుతున్నారు.
  • ఇవి పాటించండి: ఒకవేళ బయటకు రావలసి వస్తే వడదెబ్బ తగలకుండా తలకు టోపీ, రుమాలు లేదా గొడుగు, మాస్క్‌ కచ్చితంగా వాడాలి.
  • ద్ర‌వ ప‌దార్థాలు తీసుకోవాలి: శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండటానికి నిరంతరం తాగునీరు, మజ్జిగ, కొబ్బరిబొండాలు, ఓఆర్ఎస్ (ORS) వంటివి తీసుకుంటూ ప్ర‌జ‌లు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
    వీరే కాకుండా నిత్యం రెక్కాడితే గాని డొక్కాడ‌ని బ‌తుకులు మ‌రింత ద‌య‌నీయంగా మారింది. ప్రాణాల‌ను లెక్క‌చేయ‌కుండా ప‌నులకుఉఉ వెళ్లే ఉపాధి హామీ కూలీలు, డైలీ ప‌నివారు, తాపీ ప‌నివారు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన స‌మ‌యం ఇది. ముఖ్యంగా వృద్ధులు ఇంటి ప‌ట్టున ఉండాలి. త‌గిన స‌మ‌యంలో చ‌ల్ల‌ని మ‌జ్జిగ, లేదా తాగునీరు తీసుకోవాలి.

రాబోయే రోజుల్లో ఈ Nandigama Weather మరింత ముదిరే అవకాశం క‌నిపిస్తోంది. నియోజకవర్గ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్ర‌జ‌ల‌కు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి (Recent Links)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top