ac tips

ac tips: ఏసీ వాడుతున్నారా? ఈ తప్పు చేస్తే ప్రమాదమే!

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్న సంగ‌తి విధిత‌మే. భానుడి భగభగలకు తట్టుకోలేక ప్రతి ఒక్కరూ ఇళ్లలో, ఆఫీసుల్లో ఏసీలను విపరీతంగా వాడేస్తున్నారు. చాలా మంది డ‌బ్బులు లేక‌పోయినా పెరిగిన ఎండ‌ల దృష్ట్యా ఏసీలు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ వేసవి కాలంలో ఏసీల వాడకం పెరగడంతో పాటు కొన్ని చోట్ల ఏసీలు పేలిపోతున్న ఘటనలు నిత్యం వార్తా ప‌త్రిక‌ల్లో, టీవీల్లో వింటున్నాం, చ‌దువుతున్నాం. అందుకే మీ ఏసీ సురక్షితంగా ఉండాలన్నా, అలాగే కరెంట్ బిల్లు చాలా త‌క్కువ‌గా రావాల‌న్నా ఈ ac tips పక్కాగా పాటిస్తే బిల్లు స‌గం వ‌స్తుంది. మీ ఏసి సుర‌క్షితంగా కూడా ఉంటుంది.

ac tips
ac tips

అస‌లు ఏసీలు పెల‌డానికి కార‌ణాలు ఇవి

చాలా మంది తెలిసో, తెలియ‌కో ఏసీలను గంటల తరబడి కంటిన్యూస్‌గా ఆన్ చేసి ఉంచుతారు. దీనివల్ల కంప్రెసర్‌పై తీవ్రమైన ఒత్తిడి పడి షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే సరైన సర్వీసింగ్ లేకపోవడం, లోకల్ వైరింగ్ వాడటం వల్ల కూడా ప్రమాదాలు ఎక్కువ‌గా జ‌రిగే అవ‌కాశం ఉంటుంది. మ‌రికొంత మంది ఎండ‌లో కంప్రెసర్ పెట్ట‌డం చేస్తుంటారు అది కూడా చాలా ప్ర‌మాదం.

కరెంట్ బిల్లు తగ్గించే బెస్ట్ ac tips

ఒక‌వైపు మీ ఏసీ సేఫ్‌గా ఉంటూనే మ‌రో వైపు కరెంట్ బిల్లు తక్కువగా రావాలంటే ఇవి పాటించండి. రూమ్ టెంపరేచర్‌ను ఎప్పుడూ 24 డిగ్రీల నుండి 26 డిగ్రీల మధ్య మాత్రమే సెట్ చేసుకోండి. దీనివల్ల కంప్రెసర్‌పై లోడ్ తగ్గి ప్రమాదాలు తప్పుతాయి. మా వెబ్‌సైట్ రీడర్స్ కోసం ఈ సింపుల్ ac tips ఎంతో ఉపయోగపడతాయ‌ని ఆశీస్తున్నాం. వెంటనే మీ ఏసీని ఒకసారి చెక్ చేయండి వెంట‌నే.

ఇవి కూడా చదవండి (Recent Links)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top