panchayat

panchayat : బిగ్ ట్విస్ట్.. కుల బహిష్కరణ పంచాయితీ క్లోజ్!

ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలంలో గత కొన్ని రోజులుగా తీవ్ర సంచలనం రేపిన కుల బహిష్కరణ వివాదం ఎట్టకేలకు ఒక కొలిక్కి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. మండల పరిధిలోని శ్రీరామాపురం గ్రామంలో నెలకొన్న ఈ సామాజిక వివాదం తీవ్ర రూపం దాల్చడంతో స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు అధికారులు చేపట్టారు.

రంగంలోకి దిగిన ఎమ్మార్వో, సీఐ

శ్రీరామాపురం గ్రామానికి చెందిన‌ పెద్దలు ఒక కుటుంబాన్ని సామాజికంగా దూరం పెట్టారనే వార్త బయటకు రావడంతో రెడ్డిగూడెం ఎమ్మార్వో సుశీల దేవి, స్థానిక సీఐ కిశోర్ బాబు గ్రామానికి చేరుకున్నారు. వివాదానికి కారణమైన గ్రామ పెద్దలు, ఇరు వర్గాల వారితో అధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చట్ట వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంద‌ని హెచ్చరిస్తూనే, ఇరుపక్షాల మధ్య సామరస్య పూర్వక వాతావరణం నెల‌కొనేలా కౌన్సిలింగ్ ఇవ్వ‌డం జ‌రిగింది. అధికారుల చొరవతో ఈ panchayat వివాదం ఎట్టకేలకు స‌మ‌సిపోయిన‌ట్టు తెలుస్తోంది.

వివాదం ఎందుకొచ్చింది..?

గ్రామంలోని బాధిత కుటుంబంలో ఇటీవల జరిగిన ఒక చిన్నారి బారసాల (నామకరణ) వేడుకకు ఊరి జనాలు ఎవరూ రాకపోవడంతోనే ఈ వివాదం మొద‌లైన‌ట్టు తెలుస్తోంది. అక్క‌డే ఈ వివాదం ప్రారంభ‌మ‌యింద‌ని సీఐ కిశోర్ బాబు స్పష్టం చేశారు. గ్రామ పెద్దలు ఆదేశాలు ఇవ్వ‌డం వ‌ల్లే ఊరిలోని ప్ర‌జ‌లు ఎవ‌రూ ఆ కార్య‌క్ర‌మానికి రాలేదని బాధిత కుటుంబం భావించడంతో గొడవ మొదలైంది. అయితే ప్రస్తుతం గ్రామంలో ఎలాంటి సమస్యా లేదని, ఊరి పెద్దలు మరియు బాధిత కుటుంబం అంతా కలిసిపోయారని పోలీసులు తెలిపారు.

panchayat
panchayat

శ్రీరామాపురం ఇప్పుడు ప్ర‌శాంతం

ఈ వివాదంపై సీఐ కిశోర్ బాబు మాట్లాడుతూ.. శ్రీరామాపురంలో ప్రస్తుతానికి ఎలాంటి సమస్య లేదు. గ్రామంలో అంతా ప్రశాంత వాతావరణం నెలకొంది. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదు అని స్పష్టం చేశారు. సామాజిక దూరం లేదా బహిష్కరణ లాంటివి చేస్తే చట్టప్రకారం కఠిన శిక్షలు ఉంటాయని అధికారులు గ్రామస్తులకు వివరించారు. ఈ panchayat ముగియడంతో అటు గ్రామస్తులు, ఇటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు అంతా ప్ర‌శాంతం.. మీ ఊరిలో ప‌రిస్థ‌తి ఇప్పుడు ఎలా ఉందో కామెంట్లే చెప్పండి.

ఇవి కూడా చదవండి (Recent Links)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top